మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?  

01 September 2025

Prudvi Battula 

A బ్లడ్ గ్రూపు వారు తెలివైన వారు. ఏం చేసినా శ్రద్ధతో చేస్తారు. సున్నితంగా ఉంటారు. అందరికి సాయం  చేస్తు ఉంటారు.

A గ్రూపు వాళ్లు చాలా నమ్మకంగా, సహనంగా ఉంటారు. ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటారు. వీళ్లకు రూల్స్ బ్రేక్ చెయ్యడం నచ్చదు. వీళ్లలో చాలా మందికి OCD సమస్య ఉంటుంది.

B బ్లడ్ గ్రూపు వారు తమ క్రియేటివిటీతో ఫేమస్ అవుతారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. దేనిపైనైనా శ్రద్ధ పెట్టారంటే... పూర్తిగా దానిపై ఏకాగ్రత చూపించగలరు.

B గ్రూప్ వారిలో ఈ సమాజం ఎక్కువగా నెగెటివ్ లక్షణాలనే చూస్తుంది. అందువల్ల వీళ్లు ఒంటరి అవుతుంటారు. వీళ్లను అంచనా వెయ్యడం కష్టం.

A, B గ్రూపుల లక్షణాలు రెండు AB గ్రూపు వారిలో ఉంటాయి. వీళ్లు ఒక్కోసారి B లాగా చాలా ధైర్యంగా ఉంటారు, ఒక్కోసారి A లాగా బాగా మొహమాట పడతారు.

AB టైపు వారితో ఎవరైనా ఫ్రెండ్షిప్ ఎప్పుడూ సరదాగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్ని వీళ్లు పెద్దగా పట్టించుకోరు. వీళ్లు ఒత్తిడిని జయించడంలో విఫలమవుతుంటారు.

O గ్రూపు వ్యక్తులు పక్షుల్లా విహరించేందుకు ఇష్టపడతారు. ఒకే చోట ఉండలేరు. ధైర్యం ఎక్కువ. తమను తాము ఉన్నత స్థానాల్లో ఉండేలా చూసుకుంటారు.

O గ్రూపు వాళ్లు ఉదారంగా ఉంటారు. దయాగుణం, జాలి గుణం ఎక్కువ. వీళ్లను ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇలాగే ఉండాలనే రూల్ వీళ్లు పెట్టుకోరు.