ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..
06 September 2025
Prudvi Battula
ప్రస్తుతం చాలా రెస్టారెంట్లు GST పన్ను పేరుతో ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నాయి. ఇది ఒక రకమైన GST స్కామ్.
రెస్టారెంట్ GST స్కామ్‌ను నివారించడానికి, ముందుగా మీకు ఇచ్చిన బిల్లులో GST నంబర్ వ్రాసి ఉందో లేదో తనిఖీ చేయండి.
రాసి ఉంటే, services.gst.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి, అక్కడ రెస్టారెంట్ GST నంబర్‌ను నమోదు చేసి, చెక్ చేయండి.
ఇప్పుడు GSTIN , UIN స్థితిని తనిఖీ చేయండి, అవి యాక్టివ్‌గా ఉంటే పన్ను వసూలు చేయడం సరైనదే. రద్దు చేసినట్లు చూపిస్తే, రెస్టారెంట్ పన్ను వసూలు చేయకూడదు.
దీని తరువాత, ఖచ్చితంగా పన్ను చెల్లింపుదారు రకాన్ని తనిఖీ చేయండి. అది కంపోజిషన్ రకం అయితే, రెస్టారెంట్ పన్ను వసూలు చేయదు.
కాంపోజిషన్ పథకం కింద ఉన్న వ్యాపారులు పన్ను చెల్లించరు. వారు నిర్ణీత మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
GST నంబర్ యాక్టివ్‌గా లేకున్నా, పన్ను వసూలు చేస్తుంటే, అది తప్పు. రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీయండి.
అటువంటి పరిస్థితిలో, మీరు హెల్ప్‌లైన్ నంబర్ 1800-1200-232కు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో మీకు పరిస్కారం లభిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..