టాయిలెట్ ఆ దిక్కున ఉందా.? దరిద్రం మీతో ఫుట్ బాల్ ఆడినట్టే.. 

09 September 2025

Prudvi Battula 

వాస్తు ప్రకారం.. ఇంటిని నిర్మించుకోవడం మంచిదని హిందువులు నమ్ముతారు. అందుకే కిచెన్ నుంచి టాయిలెట్ వరకు వాస్తు ఆధారంగా నిర్మించుకుంటారు.

ఇలా ఇంటిని కట్టుకుంటే ఆ కుటుంబం కలకలం సుఖ సంతోషాలతో జీవిస్తుంది. మీ ఇంటి వంట గది నుంచి టాయిలెట్ వరకు సరైన దిక్కున నిర్మించడం వల్ల మేలు జరుగుతుంది.

వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ దిక్కున టాయిలెట్ ఉంటే మాత్రం దరిద్రం అంటున్నారు పండితులు.

ఉత్తరని కుబేరుడు పాలకుడు. ఈ అష్ట ఐశ్వర్యాలను సూచిస్తుంది. ఈ దుక్కన బంగారం, డబ్బు, లాకర్ వంటి పెట్టడం మంచిది.

ఉత్తర దిశ వ్యాపార వృద్ధి, కొత్త అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లకు ప్రతీక. ఈ దిశను ఎప్పుడూ శుభ్రంగా నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి.

అత్తరం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే పాజిటివ్‌ ఎనర్జీ ఇంట్లోని ప్రవేశిస్తుంది. ఏదైనా లోపం ఉంటే యజమాని లేదా కుటుంబ సభ్యులపై ప్రభావితం చూపుతుంది.

వాస్తు ప్రకారం టాయిలెట్‌, చెత్త బుట్ట, ఇంట్లో వ్యర్థాలను ఉత్తర దిశలో ఉంచకూడదు. ఇవి ఆ డైరెక్షన్‌లో ఉంటే ఇంట్లో కష్టాలు వస్తాయి.

దీనివల్ల వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగం పోయి కొత్త అవకాశాలు రాకపోవడం, కెరీర్ ఎదుగుదల ఆగిపోవడం వంటివి జారుతాయి.

ఇది నెమ్మదిగా ఆర్థిక, మానసిక సమస్యలకు కారణం అవుతుంది. అందుకే మీ ఇంట్లో టాయిలెట్ ఉత్తర దిశలో ఉంటే వెంటనే మార్చండి.