గర్భిణులు చికెన్ లివర్ తినొచ్చా.? లాభమా.? నష్టమా.? 

09 September 2025

Prudvi Battula 

చికెన్ లివర్‎లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు, మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

చికెన్ లివర్ తరచూ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.

చికెన్ లివర్‌లో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీంతో వ్యాధుల రాకుండా రక్షణ లభిస్తుంది.

దీనిలోని విటమిన్ బి కాంప్లెక్స్ మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ కారణంగా చికెన్ లివర్‌ను అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు పోషకాహార నిపుణులు.

చికెన్ లివర్‌ తినాలనుకుంటే మాత్రం దాన్ని బాగా ఉడికించడం ముఖ్యం. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

గర్భంతో ఉన్న స్త్రీలు కూడా చికెన్ లివర్‌ను తక్కువ మోతాదులో తినడం మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

గర్భిణులు చికెన్ లివర్ ఎక్కువగా తింటే ఇందులో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ పుట్టబోయే శిశువుకి హాని కలిగిస్తుంది.