ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు కన్నురెప్పలు కొడతారో తెలుసా?
13 September 2025
Prudvi Battula
మన కళ్ళ ఆరోగ్యానికి రెప్పవేయడం చాలా ముఖ్యం. కనురెప్పల ఉపరితలం తేమగా ఉండటానికి ఇది అవసరం అంటున్నారు నిపుణలు.
తరుచూ మనం కళ్ళు రెప్పవేయడం వల్ల కళ్ళలోని మురికి తొలగిపోతుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం మెరుగుపతుందన్నది నిపుణుల మాట.
ఇది కళ్ళకు ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
సగటున, మనిషి రోజుకు సుమారు 14,000 నుండి 21,000 సార్లు రెప్పలు మూస్తారు. రెప్పపాటు వేగం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలాగా మారుతుంది.
వ్యక్తి చేస్తున్న పనిని బట్టి ఈ వేగం కూడా మారవచ్చు. ఒక వ్యక్తి కంప్యూటర్ స్క్రీన్‌ను చూసినప్పుడు, అతను తక్కువగా రెప్పపాటు చేస్తాడు.
మీ కళ్ళు రెప్పవేయడంలో ఏదైనా సమస్య ఎదురైతే, అప్పుడు వైద్యుడిని సంప్రదించండి. అయన సూచనలతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఆహారాలను మీ డైట్లో చేర్చుకుంటే మన కంటికి సమస్యల రాకుండా దూరం పెట్టవచ్చు.
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మన కంటికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని కూడా మీ డైట్లో చేర్చుకుంటే మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
టాయిలెట్ ఆ దిక్కున ఉందా.? దరిద్రం మీతో ఫుట్ బాల్ ఆడినట్టే..
ఆ బ్లడ్ గ్రూప్‌కి దోమలు ఫ్యాన్స్.. ఎందుకంటారు.?
గర్భిణులు చికెన్ లివర్ తినొచ్చా.? లాభమా.? నష్టమా.?