ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్‎లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..

17 September 2025

Prudvi Battula 

ఎండు చేపల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదలకి అవసమైన పోషకం.

డ్రై ఫిష్‌లలో పుష్కలంగా ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. వాపును తగ్గిస్తాయి. మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి.

ఎండిన చేపల్లో విటమిన్లు డి, బి12 సెలీనియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

డ్రై ఫిష్‌లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ట్రైగ్లిజరైడ్‌లు రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఎండు చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మేరుపరుస్తాయి. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఎండిన చేపల్లో ఎక్కువగా ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ బలమైన ఎముకలు, దంతాలను నిర్వహించడానికి ఎంతగానే సహాయపడతాయి.

ఎండు చేపలు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్ వంటి పరిస్థితులు నుంచి ఉపాసనం కలిగిస్తాయి.

డ్రై ఫిష్‌లలో తక్కువ తేమ కారణంగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇది అనుకూలమైన, స్థిరమైన ప్రోటీన్ మూలంగా మారుతుంది.