ఫ్రెంచ్ ఫ్రైస్‎తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?

06 October 2025

Prudvi Battula 

వారానికి మూడు సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 20% పెరుగుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.

హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల పరిశోధకుల అధ్యయనంలో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ లేని రెండు లక్షలకు పైగా వ్యక్తుల ప్రతిస్పందనలను విశ్లేషించారు.

40 సంవత్సరాల కాలంలో ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో దాదాపు 22,300 మందికి మధుమేహం బారిన పడినట్లు తేలింది.

వారానికి మూడు సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకునే ప్రతిసారీ, రేటు 20% పెరిగిందని అధ్యయనం తేల్చి చెప్పింది.

బంగాళాదుంపలు ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ వాటిలో స్టార్చ్, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి. వీటితో డయాబెటిస్ పెరుగుతుంది.

బంగాళాదుంపలను తృణధాన్యాలతో భర్తీ చేయడం వల్ల తక్కువ ప్రమాదం ఉంది. అయితే తెల్ల బియ్యంతో భర్తీ చేయడం వల్ల ప్రమాదం పెరిగింది.

ముఖ్యంగా వారంలో మూడు సార్లు బంగాళాదుంపలు తింటే డయాబెటిస్ ప్రమాదం 5% పెరుగుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ మూడు సార్లు తినడం వల్ల 20% పెరుగుతుంది.

బంగాళాదుంపలను తృణధాన్యాలకు మారడం వల్ల డయాబెటిస్ ప్రమాదం 8% తగ్గుతుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తృణధాన్యాలతో భర్తీ చేస్తే 19% తగ్గింది.