Health Benefits of Green Coffee: గ్రీన్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా? రోజుకు ఒక్క కప్పు తాగారంటే..

బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీపై ఆధారపడతారు. కానీ గ్రీన్ కాఫీ గురించి చాలా మందికి తెలియదు. ఇది కూడా బరువు తగ్గడంలో ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ కాఫీ తాగిన తర్వాత కనీసం అరగంట వరకు ఏమీ తినకూడదు. రోజూ ఉదయం పూట ఒకసారి తాగితే సరిపోతుంది.గ్రీన్ కాఫీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియలను నియంత్రిస్తుంది. దీనిని నిత్యం..

Srilakshmi C

|

Updated on: Sep 13, 2023 | 8:18 PM

బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీపై ఆధారపడతారు. కానీ గ్రీన్ కాఫీ గురించి చాలా మందికి తెలియదు. ఇది కూడా బరువు తగ్గడంలో ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ కాఫీ తాగిన తర్వాత కనీసం అరగంట వరకు ఏమీ తినకూడదు. రోజూ ఉదయం పూట ఒకసారి తాగితే సరిపోతుంది.

1 / 5
గ్రీన్ కాఫీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియలను నియంత్రిస్తుంది. దీనిని నిత్యం తీసుకోవడం వల్ల తరచూ అనారోగ్యానికి గురికావడాన్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా గ్రీన్ కాఫీ తాగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు, అల్జీమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
గ్రీన్ కాఫీ శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. మార్కెట్లో రెండు రకాల గ్రీన్ కాఫీలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పచ్చి గింజలు, మరొకటి టీ పొడి. వీటిని ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. మీరు కాఫీ గింజలను వాడుతున్నట్లయితే, వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి వినయోగిస్తూ మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా నానబెట్టిన నీటిని ఉదయం తక్కువ మంటపై బాగా మరిగించిన తర్వాత వడపోసి గోరువెచ్చగా తాగాలి.

3 / 5
కాఫీ పౌడర్ ఉపయోగిస్తున్నట్లయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. ముందుగా నీటిని బాగా మరిగించి, అందులో ఒక స్పూన్‌ కాఫీ పొడిని మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి. గ్రీన్ కాఫీలో చక్కెరను అస్సలు ఉపయోగించ కూడదు. రుచి కోసం కొంచెం తేనెను కలుపుకోవచ్చు.

4 / 5
ఐతే ఈ టీని రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువ తాగకూడదు. లేదంటే శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంది. సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొన్ని సందర్భాల్లో వికారం, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి.

5 / 5
Follow us