- Telugu News Photo Gallery Cinema photos Kollywood actor Ashok Selvan marries Keerthi Pandian Photos goes viral telugu cinema news
Ashok Selvan: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఫోటోస్ వైరల్..
కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తన ప్రియురాలు కీర్తి పాండియన్ సెప్టెంబర్ 13న వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శనివారం చెన్నైలో రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 'పోర్ థోయిల్' సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న అశోక్ సెల్వన్ హీరోయిన్ కీర్తి పాండియన్‌ను వివాహం చేసుకున్నారు.
Updated on: Sep 13, 2023 | 8:22 PM

కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తన ప్రియురాలు కీర్తి పాండియన్ సెప్టెంబర్ 13న వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శనివారం చెన్నైలో రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'పోర్ థోయిల్' సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న అశోక్ సెల్వన్ హీరోయిన్ కీర్తి పాండియన్‌ను వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో బుధవారం (సెప్టెంబర్ 13) వీరి వివాహం జరిగింది.

ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా.. శనివారం చెన్నైలో రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెలబ్రెటీలు, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అశోక్ సెల్వన్ 2013లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘పోర్ థోయిల్’ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.

అశోక్, కీర్తి పాండియన్ బ్లూ స్టార్ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కీర్తి తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు. ప్రస్తుతం వివాహంకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.





























