ఉదయం నిద్రలేచిన వెంటనే మేల్కొన్న తరువాత శరీరం రోజును ప్రారంభించడానికి సిద్దంగా ఉంటుంది. రోజును ప్రారంభించే ముందు ఉదయం పూట మనం తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం
TV9 Telugu
ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం మన శక్తి స్థాయిలను, మన శరీర జీవక్రియలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అలాగేరాత్రంతా ఉపవాసం ఉన్న తరువాత శరీరానికి శక్తిని అందించడానికి, హైడ్రేట్ చేయడానికి పోషకాలు చాలా అవసరం
TV9 Telugu
కనుక ఉదయం మనం తీసుకునే ఆహారం ఆకలిని తీర్చడంతో పాటుగా జీవక్రియలను మెరుగుపరిచేదిగా, శక్తిని అందించేదిగా ఉండాలి. కనుక ఉదయం పూట అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఆకలి తీరడంతో పాటు శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు అన్నీ అందుతాయి
TV9 Telugu
ఖాళీ కడుపున అరటి పండ్లను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రక్తపోటు స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవడం ప్రయోజనకరంగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అందరికీ ఒకేలా పని చేయదు
TV9 Telugu
ఖాళీ కడుపుతో అరటిపండును ఉదయం పూట తీసుకోవడం అందరికి సరిపోదని వారు సూచిస్తున్నారు. అరటిపండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది
TV9 Telugu
దీంతో శరీరం మొత్తం శక్తి స్థాయిలు కూడా తగ్గుతాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అలాగే అరటిపండులో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ దీనిని తిన్న కొన్ని నిమిషాలకే ఆకలి పెరుగుతుంది
TV9 Telugu
దీని వల్ల మనం అతిగా తినే అవకాశం కూడా ఉంది. తద్వారా శరీర బరువు కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇది కొందరిలో కడుపు నొప్పికి కారణమవుతుంది
TV9 Telugu
ఫైబర్ సాధారణ మోతాదులో తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో తీసుకునే ఫైబర్ కొందరిలో కడుపులో చికాకు, ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. కనుక సున్నితమైన జీర్ణాశయం ఉన్న వారు ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోకపోవడమే మంచిది