AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oral Health Tips: నోటి ఆరోగ్యం కోసం ఆయిల్ ఫుల్ బెస్ట్ చిట్కా.. 21 రోజుల పాటు చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే..

శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. దంతాల సమస్యలు కొన్ని సార్లు ఇబ్బంది కలిగిస్తాయి. అపుడు చాలా మంది మార్కెట్లో లభించే రకరకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి రసాయన ఉత్పత్తులకు బదులుగా వంటింటి చిట్కా అయిన ఆయిల్ పుల్లింగ్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. 21 రోజుల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో నిపుణుల చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం.

Oral Health Tips: నోటి ఆరోగ్యం కోసం ఆయిల్ ఫుల్ బెస్ట్ చిట్కా.. 21 రోజుల పాటు చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే..
Oil Pulling For Oral Health
Surya Kala
|

Updated on: Aug 09, 2025 | 1:57 PM

Share

శరీరంతో పాటు, నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. పసుపు దంతాలు, దుర్వాసన, దంతాల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమస్యలు ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తాయి. దీని కోసం ప్రజలు అనేక పద్ధతులను అవలంబిస్తారు. వాటిలో ఒకటి ఆయిల్ పుల్లింగ్. ఇది మొత్తం నోటిని ఒకేసారి శుభ్రం చేసుకునే టెక్నిక్. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా ఆయిల్ పుల్లింగ్ చాలా సులభం. దీని కోసం కొబ్బరి నూనె , నువ్వుల నూనెను ఉపయోగించమని సిఫార్సు చేయబడింది. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్లు ఉన్నాయి. అయితే 21 రోజుల పాటు రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన ఏమి జరుగుతుంది? నిపుణుల చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

నిపుణులు ఏమంటున్నారు? ఎండోడాంటిస్ట్, డెంటల్ సర్జన్ అనిల్ కోహ్లీ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆయిల్ పుల్లింగ్ అనేది మన దేశంలో ఉపయోగించే పురాతన ఆయుర్వేద పద్ధతి. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆయిల్ పుల్లింగ్ కోసం ఉపయోగిస్తారు. ఆయిల్ పుల్లింగ్ నోటి నుంచి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ప్లేక్‌ను తొలగిస్తుంది. దుర్వాసనను తొలగిస్తుంది. అయితే 21 రోజులు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పెద్దగా తేడా ఉండదు. దంత సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించాలని చెప్పారు.

ఆయిల్ పుల్లింగ్ ఎవరు చేయకూడదు? నోటిలో పుండ్లు ఉన్నవారు, కొబ్బరి, నువ్వుల నూనె అంటే అలెర్జీ ఉన్నవారు, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్‌లు ఉన్నవారు లేదా మింగడంలో ఏదైనా సమస్య ఉన్నవారు ఆయిల్ పుల్లింగ్ చేయకూడదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా ఈ పద్ధతిని చేయకూడదు.

ఇవి కూడా చదవండి

ఆయిల్ పుల్లింగ్ ఎంతసేపు చేయాలంటే అనిల్ కోహ్లీ ఆయిల్ పుల్లింగ్ 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే చేయాలని చెప్పారు. నోరు తరచుగా పొడిగా ఉండే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఆయిల్ పుల్లింగ్‌ను దంతాలను శుభ్రం చేసుకునేందుకు దీనిని ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని చెప్పారు. ఆయిల్ పుల్లింగ్‌తో పాటు సరిగ్గా బ్రష్ చేసుకోవాలి. ఎవరైనా దంతాల సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. మంచి దంతవైద్యుడి వద్దకు వెళ్ళాలని సూచించారు. ఆయిల్ పుల్లింగ్ , ఇతర గృహ నివారణలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకానీ దంతాల సమస్యను పూర్తిగా నయం చేయవని చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)