రాఖీ పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులు
ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ అంటే ఈ రోజు శ్రావణ పౌర్ణమి విశేషమైన రోజు. ఓ వైపు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఘనంగా రాఖీ పండగను జరుపుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు మన దేశం స్వాతంత్ర్య కోసం చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం. ఈ నేపద్యంలో మన దేశ ప్రధాని మోడీ , హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు 'క్విట్ ఇండియా ఉద్యమం'లో పాల్గొన్న వారికి నివాళులు అర్పించారు.

హిందువులు జరుపుకునే పండగలలో రాఖీ పండగ ఒకటి. ఈ రోజు రాఖీ పండగని దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తోబుట్టువుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పండుగ ప్రాముఖ్యత నొక్కి చెబుతూ ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు, సోదరీమణుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఆయన తన సందేశంలో ప్రస్తావించారు.
Today, on Shravan Poornima, we mark World Sanskrit Day. Sanskrit is a timeless source of knowledge and expression. Its impact can be found across sectors. This day is an occasion to appreciate the effort of every person around the world who is learning and popularising Sanskrit.
— Narendra Modi (@narendramodi) August 9, 2025
అమిత్ షా కూడా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీనితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమ, విశ్వాసం, భద్రతల అవినాభావ బంధానికి ప్రతీక. రక్షా బంధన్ అనే పవిత్ర పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉత్సాహానికి మూలంగా మారాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
సోదర-సోదరీమణుల ప్రేమకు ప్రతీక అదేవిధంగా దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రాఖీ పండగ సందర్భంగా శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా చెప్పారు. రక్షా బంధన్ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ పండుగ రాఖీ.. రక్ష పవిత్రతకు చిహ్నం మాత్రమే కాదు, మన సోదరీమణుల గౌరవం, భద్రత, ఆనందం, శ్రేయస్సు పట్ల మన నిబద్ధతకు చిహ్నం కూడా. సోదర-సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన ఈ పండుగ మనలోని రక్షణ స్ఫూర్తిని బలోపేతం చేయుగాక అని దేవుడికి ప్రార్దించారు.
‘క్విట్ ఇండియా ఉద్యమం’లో పాల్గొన్న వారికి నివాళులు ఈ రోజు రాఖీ పండగతో పాటు క్విట్ ఇండియా ఉద్యమం 83వ వార్షికోత్సవం కూడా.. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రధానమంత్రి మోడీ నివాళులర్పించారు. వారి ధైర్యం దేశభక్తి అనే జ్వాలను వెలిగించిందని.. ఇది స్వేచ్ఛా అన్వేషణలో లెక్కలేనన్ని మందిని ఏకం చేసిందని అన్నారు. “బాపు స్ఫూర్తిదాయక నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆ ధైర్యవంతులందరినీ జీవితాంతం కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని చెప్పారు. ఈ ఉద్యమంలో పాల్గొని ధైర్యాన్ని, దేశభక్తి జ్వాలను వెలిగించి స్వాతంత్యం కోసం దేశ ప్రజలను ఏకం చేసిన వారందరికీ నివాళులర్పించారు.
We remember with deep gratitude all those brave people who, under the inspiring leadership of Bapu, took part in the Quit India Movement. Their courage lit a spark of patriotism that united countless people in the quest for freedom.
— Narendra Modi (@narendramodi) August 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








