AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిక్క కుదిరింది.. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రీల్స్ చేస్తున్న మహిళకు దిమ్మతిరిగే షాక్.. ఈ వ్యక్తి ఏం చేశాడంటే..?

ఈ మధ్య ప్రతి ఒక్కరూ రీల్స్ పోజులో పడి పరిసరాలను సైతం మరిచిపోతున్నారు. ఇలాంటిదే ఒక అమ్మాయి వీడియో ఒకటి బయటకు వచ్చింది, అందులో ఆమె తన కోసం రీల్ షూట్ చేసుకుంటుండగా.. అకస్మాత్తుగా ఆమెకు ఏదో జరిగింది. ఆమె ఊహించని షాక్ తగిలింది. అందుకే ఆ వీడియో జనాల్లోకి వచ్చిన వెంటనే తెగ వైరల్ అవుతోంది.

తిక్క కుదిరింది.. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రీల్స్ చేస్తున్న మహిళకు దిమ్మతిరిగే షాక్.. ఈ వ్యక్తి ఏం చేశాడంటే..?
Reel Viral Video
Balaraju Goud
|

Updated on: Aug 09, 2025 | 1:10 PM

Share

ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమాని.. రీల్స్ చేయడం క్రేజ్‌గా మారిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే, ప్రజలు ఎక్కడైనా కెమెరా ఆన్ చేసుకుంటారు, స్థలం, పర్యావరణం, పరిస్థితుల గురించి పట్టించుకోరు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు వీడియో ఎక్కడ తీస్తున్నారో కూడా వారికి పట్టింపు ఉండదు. దీని కోసం ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికైనా.. సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. తాజగా అలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. రైలు దిగిన తర్వాత స్టేషన్‌లో ఒక అమ్మాయి రీల్ చేస్తుండగా, ఆ సమయంలో ఆమెను పక్కకు నెట్టిసేందుకు యత్నించాడు ఓ యువకుడు. దీంతో ఇద్దరి మధ్య రచ్చ రాజుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో, రైలు దిగిన తర్వాత స్టేషన్‌లో రీల్ చేస్తూ.. ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. ఆమె కెమెరా ముందు స్టెప్పులు వేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఈ డ్రామా అంతా నచ్చలేదు. అతను కోపంగా ఆ అమ్మాయిని నెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఆ అమ్మాయి కోపంగా ఆ వ్యక్తిని గట్టిగా నిలదీసింది. “నీకు పిచ్చి పట్టిందా?” అని సమాధానంగా, ఆ వ్యక్తి.. “ఇది తమాషా చేయడానికి సరైన ప్రదేశమా?” ఆ అమ్మాయి మళ్ళీ అడిగింది, “నువ్వు నన్ను ఎందుకు నెట్టావు?” అంటూ.. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

దీంతో, ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ సమయంలో, మరో ఇద్దరు వ్యక్తులు.. ఇరువురిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ ఎవరూ తగ్గడానికి సిద్ధంగా లేరు. అప్పుడు స్టేషన్‌లో రైలు దిగుతున్న మరో మహిళ విషయం అర్థం చేసుకుని జోక్యం చేసుకుంది. ఆమెకు మొత్తం విషయం తెలిసినప్పుడు, ఆమె ఆ వ్యక్తితో ఆ అమ్మాయిని నెట్టి ఉండకూడదని చెప్పింది. చివరికి ఆ వ్యక్తి తన తప్పును గ్రహించి ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి వెళ్లిపోయాడు.

ఈ వీడియోను సోషల్ మీడియా Xలో @yati_Official1 అనే ఖాతా నుండి షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారుడు మామ ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను అని రాశారు. మరొకరు మామ నెట్టడం కంటే తెలివిగా మాట్లాడి ఉండాల్సిందని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..