AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Affair: కలికాలం అంటే ఇదేనా.. పెంచిన మేనల్లుడితో ప్రేమలో పడిన అత్త.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..

ప్రస్తుతం వివాహ బంధానికి బీటలు పడినట్లు కొంతమంది దంపతులు ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరచి ఇష్టారీతిన వివాహేతర బంధాలను నెరుపుతున్నారు. ఇలాంటి వార్తలు అనేకం వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా ఒక అత్త తన మేనల్లుడిని ప్రేమించి.. మానవత్వం అనే మాట మరచి .. తన భర్తపై దాడి చేసింది. చేయి విరిచి తన కొడుకుని తీసుకుని మేనల్లుడితో పారిపోయింది. ఈ దారుణమైన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ కేసు వార్తల్లో నిలుస్తోంది.

Love Affair: కలికాలం అంటే ఇదేనా.. పెంచిన మేనల్లుడితో ప్రేమలో పడిన అత్త.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..
Love Affair
Surya Kala
|

Updated on: Aug 09, 2025 | 12:24 PM

Share

బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో అత్త, మేనల్లుడి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఆ అత్త తాను చేసే పని తప్పు అని మరచిపోయింది.. తన భర్తపై ఆసక్తి లేదంటూ తన మేనల్లుడితో పారిపోయింది. వెళ్లే ముందు ఆమె తన భర్తపై కూడా దాడి చేసి గాయపరచింది. కొడుకును కూడా తనతో తీసుకెళ్లింది. అత్త చేసిన ఈ చర్యతో గ్రామం మొత్తం షాక్ అయ్యింది. భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పరారీలో ఉన్న అత్త, మేనల్లుడి కోసం వెతకడం ప్రారంభించారు.

ఈ సంఘటన బోచహాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగింది. ఇక్కడ నివసిస్తున్న నావల్ కిషోర్ , ఖుష్బూ దేవిలకు 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతుల జీవితం సంతోషంగా సాగుతోంది. వీరి జీవితంలోకి మేనల్లుడు నీరజ్ ఈ దంపతులకు మధ్యకు వచ్చాడు. ఇంటికి వచ్చి వెళ్తున్న మేనల్లుడితో అత్త ప్రేమలో పడింది. భర్త బయటకు వెళ్ళే సమయంలో అత్త తరచుగా మేనల్లుడిని ఇంటికి పిలిచేది. తనకంటే 10 ఏళ్ల చిన్నవాడని మరచింది. మేనల్లుడికి కూడా అత్తపై ప్రేమ పుట్టింది. దీంతో ఖుష్బూ తన భర్తను కొట్టి మేనల్లుడితో పారిపోయింది.

బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తన భార్యని తిరిగి తీసుకుని రావాలని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేశాడు. గర్హాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే తన మేనల్లుడు తరచుగా మా ఇంటికి వచ్చేవాడని బాధిత భర్త చెప్పాడు. తన భార్యను ప్రేమించాడు.. నేను వీరి ప్రేమని వ్యతిరేకించానని అతను నాతో గొడవ పడటం ప్రారంభించాడు. అంతేకాదు వారిద్దరూ నన్ను కొట్టారని పోలీసులకు చెప్పాడు. తన కొడుకు కూడా ఈ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించాడు. ఎంత వద్దని వారించినా వారిద్దరూ వినలేదు. ఇప్పుడు నా భార్య నా మేనల్లుడితో పాటు నా కొడుకుని తీసుకుని పారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

ఖుష్బూ దేవి తన ప్రేమికుడితో కలిసి 50 వేల రూపాయల నగదు, లక్షల విలువైన నగలు, భూమి పత్రాలు తీసుకొని ఇంటి నుండి పారిపోవాలని ప్లాన్ చేసింది. అప్పుడు తనకు ఈ విషయం తెలిసి వెంటనే తన భార్యని ఆపడానికి ప్రయత్నించాను. అయితే నీరజ్, ఖుష్బూ నన్ను కొట్టారు. నా చేతులు విరిచారు. ఆ తర్వాత ఇద్దరూ పారిపోయారు. వెళ్ళేటప్పుడు, ఖుష్బూ నేను ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించిందని నావల్ కిషోర్ చెప్పాడు.

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు

బాధితురాలిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్హెచ్ఓ రాకేష్ కుమార్ యాదవ్ తెలిపారు. దర్యాప్తు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఇద్దరినీ పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..