AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..!

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఒక్క కాలితో భారీ ట్రక్కును గాల్లోకి ఎగరేశాడా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం కాదు. ఏఐతో రూపొందించిన ఈ క్రేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ ప్రపంచంలో క్రియేటర్ల సృజనాత్మకతకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.

సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..!
Viral Video
SN Pasha
|

Updated on: Aug 05, 2026 | 6:38 PM

Share

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రీల్స్ ఫార్మాట్ వచ్చిన తర్వాత కుప్పలు కుప్పలుగా రీల్స్ మన కంట్లో పడుతున్నాయి. ఎన్ని చూసినా తనివి తీరని వ్యసనంలా మారిపోయాయి రీల్స్. ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు చాలా మంది. అగ్నికి వాయువు తోడు అన్నట్లు.. రీల్స్‌కు ఏఐ తోడైంది. ఇంకేముందు.. కొత్త కొత్త ఐడియాలోతో, ఆశ్చర్యమే ఆశ్చర్యపోయేలా క్రియేటర్లు క్రీజ్ రీల్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు.

తాజాగా ఓ క్రేజీ ఏఐ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్తుంటాడు. అంతలోనే ఓ పెద్ద ట్రక్ అతని రూట్‌కు ఎదురుగా అడ్డు వస్తుంది. సాధారణంగా అది చూడగానే పెద్ద యాక్సిడెంట్ అవుతుందేమో అని అనుకుంటాం. కానీ, ఒక్కసారిగా ఆ బైక్‌పై కూర్చున్న వ్యక్తి ఆ ట్రక్‌ను కాలితో ఒక్క తన్ను తంతాడు. అంతే ట్రక్ గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కగా పడుతుంది. అలా మరో రెండు వాహనాలు తన దారికి అడ్డుగా వస్తుంటే వాటిని కూడా అలాగే ఆ వ్యక్తి బైక్‌పై వెళ్తూనే కాలితో తన్నినట్లు వీడియోని ఏఐలో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు ఇంకా ఆ వీడియో చూడకుంటే.. కింద ఉంది చూసేయండి..

View this post on Instagram

A post shared by Edjinot (@edjinot10)

Follow Us