AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం వింత.. శిశువు చాతి భాగం నుంచి పుట్టుకొచ్చిన నాలుగు చేతులు, నాలుగు కాళ్లు..! వీడియో

వైద్య చరిత్రలో అత్యంత అరుదైన వైద్య ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల మహిళకు అదనపు చేతులు, కాళ్లతో వింత శిశువు జన్మించింది. తల్లి గర్భంలో పూర్తిగా అభివృద్ధి చెందని కవల శిశువు మరో శిశువుకు అనుసంధానమై ఉండటాన్ని ‘ప్యారాసిటిక్ ట్విన్’గా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి స్థిరంగా ఉండగా, అదనపు అవయవాలు శరీరానికి ఎలా అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునేందుకు నిపుణులు స్కాన్లు నిర్వహించనున్నారు..

ఇదేం వింత.. శిశువు చాతి భాగం నుంచి పుట్టుకొచ్చిన నాలుగు చేతులు, నాలుగు కాళ్లు..! వీడియో
Parasitic Twin Born In Madhya Pradesh
Srilakshmi C
|

Updated on: Aug 25, 2026 | 9:23 PM

Share

మధ్యప్రదేశ్‌, ఆగస్ట్‌ 25: తల్లి గర్భంలోనే పూర్తిగా అభివృద్ధి చెందని వింత కవల శిశువు జన్మించింది. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ అత్యంత అరుదైన ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పుట్టిన బిడ్డకు అదనంగా చేతులు, కాళ్లు ఏర్పడ్డాయి. వైద్యులు దీన్ని ‘ప్యారాసిటిక్ ట్విన్’గా పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని లవ్‌కుష్ నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రీతా అహిర్వార్ (29)కు ఆగస్టు 23న ఈ శిశువు జన్మించింది. పుట్టిన సమయంలో బిడ్డ బరువు 3 కిలోలు ఉంది. అయితే శిశువు ఛాతీ పైభాగం, పొత్తికడుపు ప్రాంతానికి అదనంగా ఒక జత చేతులు, ఒక జత కాళ్లు అనుసంధానమై ఉన్నాయి.

తన బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకున్న తండ్రి శివచరణ్ అహిర్వార్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. బిడ్డ జన్మించడం దేవుడిచ్చిన బహుమతిగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం తల్లి, శిశువును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శిశువు పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అదనపు అవయవాలు శిశువు శరీరంతో ఏ విధంగా అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు, స్కాన్లు అవసరమని వైద్యులు చెప్పారు. శిశువును సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్‌పూర్ జిల్లా ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నిపుణులు శిశువు రక్తనాళాలు, ఎముకలు, రక్త ప్రసరణ, అంతర్గత అవయవాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. పరీక్షల అనంతరం మాత్రమే అదనపు అవయవాలను తొలగించాలా? ఇతర చికిత్స అవసరమా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

‘మిలియన్‌లో ఒక కేసు’

ఈ కేసును పర్యవేక్షిస్తున్న డాక్టర్ సింగ్ ఇది అత్యంత అరుదైన కవలల పరిస్థితి అని తెలిపారు. ‘వన్-ఇన్-ఎ-మిలియన్’ కేసుగా ఆయన అభివర్ణించారు. ఆస్పత్రిలో దశాబ్దానికి పైగా పనిచేస్తున్న సీనియర్ నర్సు సవిత కూడా ఇలాంటి కేసును తన సర్వీస్‌లో తొలిసారి చూస్తున్నానని తెలిపారు. సాధారణంగా కాంజాయిన్డ్ ట్విన్స్‌లో రెండు శిశువులు తల్లి గర్భంలో ఒకరికొకరు అనుసంధానమై అభివృద్ధి చెందుతారు. అయితే ఈ కేసులో ఒక శిశువు పూర్తిగా అభివృద్ధి చెందగా, మరో కవలలో చేతులు, కాళ్ల వంటి కొన్ని శరీర భాగాలు మాత్రమే అభివృద్ధి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ప్యారాసిటిక్ ట్విన్ అంటే?

‘ప్యారాసిటిక్ ట్విన్’ అనేది అత్యంత అరుదైన పరిస్థితి. ఒకే ఫలదీకరణ చెందిన అండం నుంచి ఏర్పడే కవలల్లో ఒక శిశువు పూర్తిగా అభివృద్ధి చెందకుండా, మరో అభివృద్ధి చెందిన శిశువుకు పాక్షికంగా అనుసంధానమై ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువును ‘డామినెంట్ ట్విన్’గా పరిగణిస్తారు. అభివృద్ధి చెందని కవల శరీరంలోని కొన్ని భాగాలు డామినెంట్ ట్విన్‌కు అనుసంధానమై ఉండటంతో అదనపు చేతులు, కాళ్లు, ఇతర కణజాలాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో అభివృద్ధి చెందని అవయవాల కణజాలం, ఎముకలు కూడా ఉండవచ్చు. వాటిని తొలగించేందుకు పుట్టిన తర్వాత శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది వైద్య పరిశోధకులకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. సాధారణంగా ఒకే ఫలదీకరణ అండం నుంచి ఏర్పడిన కవలలలో ప్రారంభ దశలో పిండం పూర్తిగా విడిపోకపోవడం వల్ల కాంజాయిన్డ్ ట్విన్స్ ఏర్పడుతుంది.

కొన్ని సందర్భాల్లో ఒక పిండం గర్భంలోనే మరో పిండంలో కొంతవరకు కలిసిపోతుంది. దీంతో ఆ పిండం అభివృద్ధి ఆగిపోయి ‘ప్యారాసిటిక్ ట్విన్’గా మారే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలోనే ఈ పరిస్థితిని స్కాన్ల ద్వారా గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ, అదనపు శరీర భాగాల పరిమాణం, వాటి స్థానం వంటి అంశాల కారణంగా కొన్ని సందర్భాల్లో ఇమేజింగ్ పరీక్షల్లో కూడా గుర్తించలేకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us