AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గనున్న మద్యం ధరలు.. పండక్కి ముందే భారీ శుభవార్త.. ఈ వస్తువుల ధరలు కూడా..

ఇండియాలో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పండక్కి ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. న్యూజిలాండ్‌తో భారత్ ఇటీవల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొన్ని వస్తువుల దిగుమతలుపై కస్టమ్స్ సుంకం రాయితీలు కల్పించింది. దీని వల్ల ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

తగ్గనున్న మద్యం ధరలు.. పండక్కి ముందే భారీ శుభవార్త.. ఈ వస్తువుల ధరలు కూడా..
Alcohol Prices
Venkatrao Lella
|

Updated on: Oct 18, 2026 | 11:24 PM

Share

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకం మినహాయింపులు ప్రకటించింది. అయితే స్వేచ్చా వాణిజ్యం డీల్‌లో భాగంగా నిర్దిష్ట వస్తువులపై పన్ను మినహాయింపులు ఇవ్వనుండగా.. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అయితే ఈ క్రమంలో ఆ ఒప్పందం కింద అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇప్పుడు కస్టమ్స్ సుంకంలో మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని వల్ల న్యూజిలాండ్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులు చౌకగా మారనున్నాయి. దీంతో దేశ ప్రజలకు కూడా తక్కువ ధరకు లభించనున్నాయి. పండక్కి ముందు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

వీటిపై సున్నా కస్టమ్స్ సుంకం

భారత ఆర్ధికశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. గొర్రె మాంసంపై సున్నాకు సుంకం పరిమితం చేశారు. శీతల, ఘనీభవించిన గొర్రె మాంసానికి ఇది వర్తిస్తుంది. అలాగే కిలోగ్రాముకు 2.50 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన గల కివీ పండ్లపై 15 శాతం పన్ను విధిస్తారు. వివిధ రకాల చేపలపై 25.71 శాతం పన్ను ఉండనుండగా.. AIDC, ఆరోగ్య సెస్ సున్నాగా ఫిక్స్ చేసింది. దీని వల్ల గొర్రె మాంసం, కివీ పండ్లు, వైన్, మనుకా తేనె ధరలు తగ్గనున్నాయి. పాల ఉత్పత్తులు, కీలక వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి మినహాయింపులు కల్పించలేదు. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే కస్టమ్స్ సుంకాల్లో రాయితీలు కల్పించింది. అయితే ఈ రాయితీలు పొందాలంటే దిగుమతిదారులు న్యూజిలాండ్ మూలానికి చెందినదని అని ఏదైనా రుజువు సమర్పించాలి. అలాగే దిగుమతిదారుల నిర్దిష్ట ఉత్పత్తి అవసరాలను తీర్చాలి.

తొలి విడతగా మినహాయింపులు

స్వేచ్చా వాణిజ్యం ఒప్పందంలో భాగంగా తొలి విడతగా కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాల్లో రాయితీలు కల్పించింది. కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 25(1) కింద ఆర్ధిక శాఖ జారీ చేసిన అక్టోబర్ 16 నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట షరతులకు లోబడి రాయితీలు వర్తిస్తాయి. వివిధ సుంకాల వర్గాలకు వర్తించే రేట్లు విడిగా ఉంటాయి. దీంతో దిగుమతిదారులు వేటికి మినహాయింపులు ఉన్నాయనేది తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని టారిఫ్‌లు, సెస్సుల నుంచి మినహాయింపులు పొందవచ్చు. రానున్న రోజుల్లో న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న మరిన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం రాయితీలు కల్పించే అవకాశముంది. దీంతో కొన్ని వస్తువుల ధరలు దేశంలో తగ్గే అవకాశముంటుందని చెప్పవచ్చు.

Follow Us