AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజన్న సినిమాలో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లో ఉందిగా..

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి, తమ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వారు చాలామందే ఉన్నారు. చిన్న వయసులోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కొందరు, ఆ తర్వాత చదువుపై దృష్టి సారించి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటారు.

Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 10:27 PM

Share
 సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి, తమ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వారు చాలామందే ఉన్నారు. చిన్న వయసులోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కొందరు, ఆ తర్వాత చదువుపై దృష్టి సారించి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటారు. మరికొందరు మాత్రం నటనపై ఆసక్తితో హీరోయిన్‌లుగా, ఇతర పాత్రల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అనీ కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చిన్నారిగా కనిపించిన ఈమె, ఇప్పుడు తన లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

1 / 5
 2011లో విడుదలైన ‘రాజన్న’ సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. తెలంగాణలో రజాకార్ల పాలన, ప్రజల పోరాట నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. స్నేహ కథానాయికగా కనిపించగా, నాగార్జున కుమార్తె పాత్రలో చిన్నారి నటన ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా, కొన్ని కీలక సన్నివేశాలను ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. పలు నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్న ఈ చిత్రం, తన కథతో పాటు నటీనటుల ప్రదర్శనలతోనూ గుర్తింపు పొందింది.

2 / 5
‘రాజన్న’లో కనిపించిన చిన్నారి అనీ అంతకుముందే పలు తెలుగు సినిమాల్లో నటించింది. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రంతో బాలనటిగా పరిచయమైన ఆమె, ఆ తర్వాత ప్రముఖ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చిరంజీవి నటించిన ‘స్టాలిన్’, మహేష్ బాబు ‘అతిథి’, ‘స్వాగతం’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు, పలువురు అగ్ర హీరోల సినిమాల్లోనూ బాలనటిగా కనిపించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే నటనతో మెప్పించిన అనీకి నంది అవార్డులు కూడా లభించాయి.

3 / 5
ఒకప్పుడు తెరపై చిన్నారిగా కనిపించిన అనీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పెరిగి పెద్దదైన ఆమె, తన కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు సంబంధించిన విభిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. వెబ్ సిరీస్‌లతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌లోనూ కనిపిస్తూ డిజిటల్ ప్రేక్షకులకు చేరువవుతోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

4 / 5
 అనీ షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన స్టైలిష్ లుక్స్‌తో పాటు అందమైన చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేస్తోంది. ఒకప్పుడు చిన్నారిగా సినిమాల్లో చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు ఆమెను కొత్త రూపంలో చూసి ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఆమె ఫొటోల కింద నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు కొత్త దిశగా సాగుతుండటంతో, భవిష్యత్తులో హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు అందుకుంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

5 / 5
Follow Us