AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అక్క చనిపోయినా తెలియని చెల్లెలు! ఇంట్లోనే రోజుల తరబడి మృతదేహంతోనే..!

విజయనగరం జిల్లా పెరుమాలిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. మతిస్థిమితం లేని అక్కచెల్లెళ్లలో అక్క మృతి చెందగా, ఆ విషయం తెలియని చెల్లెలు రోజుల తరబడి మృతదేహం పక్కనే నివసించింది. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

Andhra Pradesh: అక్క చనిపోయినా తెలియని చెల్లెలు! ఇంట్లోనే రోజుల తరబడి మృతదేహంతోనే..!
Vizianagaram Tragedy
Balaraju Goud
|

Updated on: Aug 26, 2026 | 12:54 PM

Share

విజయనగరం జిల్లాలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తెర్లాం మండలం పెరుమాలిలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న ఇద్దరు అక్కచెల్లెళ్లలో అక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇద్దరికీ మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే అక్క మృతి చెందిన విషయం కూడా చెల్లెలికి తెలియకపోవడం స్థానికులను కలిచివేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెరుమాలిలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా.. మహిళ మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. అదే ఇంట్లో అక్కా మృతదేహం పక్కనే చెల్లెలు కూడా ఉండటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అక్క మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి మృతి చెంది ఎన్ని రోజులు అయ్యిందనే విషయంపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉండటం, వారిద్దరికీ మతిస్థిమితం లేకపోవడంతో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనతో పెరుమాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..