AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palmistry: వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందట!

Palmistry Predictions Telugu: హస్తసాముద్రికం ప్రకారం వేళ్ల మధ్య కనిపించే ఖాళీలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని నమ్ముతారు. చూపుడు, మధ్య, ఉంగరపు, చిటికెన వేళ్ల మధ్య ఖాళీలు వ్యక్తిత్వం, ఖర్చులు, పొదుపు, ఆర్థిక పరిస్థితి గురించి ఏం చెబుతాయో వివరంగా తెలుసుకోండి.

Palmistry: వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందట!
Palmistry Predictions Telugu
Rajashekher G
|

Updated on: Sep 16, 2026 | 7:46 PM

Share

Palmistry Predictions Telugu: హస్తసాముద్రికం ప్రకారం.. అరచేతిలోని గీతలతో పాటు చేతి ఆకారం, వేళ్ల నిర్మాణం, వాటి మధ్య ఉండే ఖాళీలు కూడా వ్యక్తి స్వభావం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాల గురించి కొన్ని సూచనలు ఇస్తాయని నమ్ముతారు. ఈ క్రమంలో చేతి వేళ్లన్నింటినీ కలిపినప్పుడు వాటి మధ్య ఖాళీలు కనిపిస్తే దానికి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని హస్తసాముద్రికం చెబుతోంది. ముఖ్యంగా ఒక్కో వేలు మధ్య ఉండే అంతరాన్ని బట్టి వ్యక్తిత్వం, డబ్బు విషయంలో వారి తీరు, భవిష్యత్ ఆర్థిక పరిస్థితిపై కొన్ని అంచనాలు చెబుతారు.

చూపుడు వేలు – మధ్య వేలు మధ్య ఖాళీ

చూపుడు వేలు, మధ్య వేలు మధ్య ఖాళీ కనిపిస్తే.. అలాంటి వ్యక్తులు స్వతంత్ర భావాలు కలిగినవారిగా పరిగణిస్తారు. ఇతరుల ఒత్తిడికి లోనవ్వడం వారికి పెద్దగా ఇష్టం ఉండదు. తమ నిర్ణయాలను తామే తీసుకుని, స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరు తమ కష్టపడి పనిచేసే స్వభావంతో సంపదతో పాటు సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించగలరని హస్తసాముద్రికం చెబుతోంది. అయితే ఎంత సంపాదించినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని భావిస్తారు. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తూ, ఖర్చులను నియంత్రించగలిగితే జీవితంలో మంచి విజయాలు సాధించవచ్చని చెబుతారు.

మధ్య వేలు – ఉంగరపు వేలు మధ్య ఖాళీ

మధ్య వేలు, ఉంగరపు వేలు మధ్య ఖాళీ ఉంటే.. అలాంటి వ్యక్తులు జీవితంలో ప్రారంభ దశలో, ముఖ్యంగా 25 ఏళ్ల వరకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని హస్తసాముద్రికంలో చెబుతారు. వృత్తి జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తారు. అయితే వీరు మనసున్న వ్యక్తులుగా ఉంటారని చెబుతారు. తమ వద్ద డబ్బు పరిమితంగా ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీవించే స్వభావం కారణంగా సరైన బడ్జెట్‌ను పాటించకపోవచ్చని నమ్ముతారు. దీంతో అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ముందస్తు ప్రణాళికతో ఖర్చులను నిర్వహించుకుంటే ఆర్థికంగా స్థిరపడవచ్చని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఉంగరపు వేలు – చిటికెన వేలు మధ్య ఖాళీ

ఉంగరపు వేలు, చిటికెన వేలు మధ్య ఖాళీ ఉండటాన్ని హస్తసాముద్రికంలో వృద్ధాప్య దశకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులతో అనుసంధానిస్తారు. ఈ రెండు వేళ్ల మధ్య ఎక్కువ ఖాళీ కనిపిస్తే.. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు హస్తసాముద్రిక నిపుణులు చెబుతారు. అందువల్ల జీవితంలో సంపాదించే సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడం, సరైన బడ్జెట్‌ను రూపొందించుకోవడం మంచిదని సూచిస్తారు. అదే సమయంలో ఉంగరపు వేలు, చిటికెన వేలు మధ్య ఖాళీ లేకపోతే.. వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండవచ్చని హస్తసాముద్రికంలో ఒక నమ్మకం ఉంది.

(Disclaimer: ఈ కథనంలోని హస్తసాముద్రికంలో ఉన్న సంప్రదాయ నమ్మకాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిన్న పరిహారాలు పాటించండి!
మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిన్న పరిహారాలు పాటించండి!
ముల్తానీ మట్టిలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ముల్తానీ మట్టిలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఓరీ దేవుడో.. ఈ రెండు పండ్లు కలిపి తిన్నారంటే ఖతమే!ఆరోగ్య నిపుణుల
ఓరీ దేవుడో.. ఈ రెండు పండ్లు కలిపి తిన్నారంటే ఖతమే!ఆరోగ్య నిపుణుల