Shubh Yoga: చంద్ర, రాహువుల యుతి.. వీరి జీవితాల్లో ఆకస్మిక శుభ యోగాలు..!
సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో కుంభ రాశిలో చంద్రుడు, రాహువు యుతి చెందనున్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని అనుకూలతలు పెరగడం, సమస్యలు పరిష్కారం కావడం, ఒత్తిళ్లు తగ్గడం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చని చెబుతున్నారు.

జీవితంలో కొన్ని సూక్ష్మమైన మార్పులు చంద్ర సంచారం వల్ల చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు సాధారణమైనవిగా పైకి కనిపించినప్పటికీ వీటి ప్రభావం మాత్రం చెరగని ముద్ర వేసే అవకాశం ఉంటుంది. ఈ నెల(సెప్టెంబర్) 23, 24, 25 తేదీల్లో కుంభ రాశిలో చంద్ర, రాహువులు యుతి చెందడం జరుగుతుంది. ఇవి కలిసినప్పుడు అనుకోకుండా కొన్ని అనుకూలతలు పెరగడం, సమస్యలు పరిష్కారం కావడం, ఒత్తిళ్లు తగ్గడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. చంద్ర రాహువుల యుతి వల్ల ఆకస్మిక శుభ యోగాలు, శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం దీని వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులకు యోగాలు పట్టబోతున్నాయి.
మేష రాశి
ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర, రాహువుల కలయిక వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించే అవ కాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధి స్తుంది. ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర, రాహువులు కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యో గులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ముంతా చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో అతి త్వరలో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
మిథున రాశి
ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర, రాహువుల కలయిక జరుగుతున్నందువల్ల ఉద్యోగులు, నిరు ద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్ల అవకాశం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలుబిజీగా సాగుతాయి. త్వరలో ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. పేరు ప్రతిష్ఠలు బాగా వృద్ధి చెందుతాయి.
తులా రాశి
ఈ రాశికి పంచమ స్థానంలో సంభవిస్తున్న చంద్ర, రాహువుల యుతి వల్ల ఉద్యోగంలో కొన్ని కీల కమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగు తుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు బయటపడతారు. శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
మకర రాశి
ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఈ చంద్ర, రాహువుల యుతి జరుగుతున్నందువల్ల అభివృద్ధికి, పురోగతికి బాగా అవకాశం ఉంటుంది. ధన యోగాలు పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడి సాఫీగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
కుంభ రాశి
ఈ రాశిలో యుతి చెందుతున్న చంద్ర, రాహువుల వల్ల ఈ రాశివారి ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభం ఎక్కు వగా ఉంటుంది. ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం అంచనాల్ని మించుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.



