AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Yogas: అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!

Chandra Mangal and Gajakesari Yoga: ఈ నెల(సెప్టెంబర్) 21, 22, 23 తేదీల్లో మకర, కర్కాటక రాశుల్లో రెండు ధన ధాన్య సమృద్ధి యోగాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు సంభవిస్తాయి. కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురువుతో కుజుడు యుతి చెందడం, అవి రెండు గ్రహాలకు మకర రాశిలో ఉన్న చంద్రుడితో పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల చంద్ర మంగళ యోగంతో పాటు, పూర్ణ స్థాయి గజకేసరి యోగం కూడా కలుగుతోంది. ఈ రెండు యోగాల వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, కార్యక్రమాలు గ్రాండ్ సక్సెస్ అవుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 2:55 PM

Share
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు, చంద్రుల పరస్పర దృష్టి వల్ల గజకేసరి యోగం, రాశ్యధిపతి కుజుడితో చంద్రుడికి సమసప్తక దృష్టి వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. రెట్టింపు బలంతో వీరికి ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు  లభిస్తాయి.

1 / 6
కర్కాటకం: ఈ రాశిలో గజకేసరి యోగంతో పాటు చంద్ర, మంగళయోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి, అదృష్టాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన యోగాలు పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెంద డం వంటివి జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశముంది.

2 / 6
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం కలగడం వల్ల దాదాపు పట్టిం దల్లా బంగారం అవుతుంది. చతుర్థ, లాభ స్థానాధిపతుల మధ్య దృష్టి ఏర్పడడం వల్ల పూర్తి స్థాయిలో ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేప ట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనా లను మించుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.

3 / 6
తుల: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు పడుతున్నందువల్ల  అనేక కీలక విషయాల్లో వీరి అదృష్టానికి తిరుగుండదు. ఆర్థికపరంగా వీరికి తప్పకుండా దశ తిరుగు తుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.

4 / 6
మకరం: ఈ రాశిలో ఉన్న చంద్రుడి వల్ల రెండు మహా భాగ్య యోగాలు కలుగుతున్నందు వల్ల ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ముతో పాటు, బాకీలు, బకాయిలను రాబట్టు కుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది.

5 / 6
మీనం: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో ఈ గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు అంచనాలకు మించి లాభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో త్వరలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి.

6 / 6
Follow Us