AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..! మీ బర్త్ డే ఇందులో ఉందా?

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటుంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని మూలాంకాలకు చెందిన వారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెబుతారు. ముఖ్యంగా మూలాంకం 1, 4, 8 ఉన్నవారికి నాయకత్వం, క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలు ఉంటాయని, ఇవి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించేందుకు దోహదపడతాయని నమ్మకం.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..! మీ బర్త్ డే ఇందులో ఉందా?
Numerology Govt Jobs Yoga
Janardhan Veluru
|

Updated on: Sep 15, 2026 | 1:56 PM

Share

మంచి ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న స్థిరత్వం, గౌరవం, భద్రత కారణంగా చాలామంది దాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే సంఖ్యాశాస్త్ర (న్యూమరాలజీ) విశ్వాసాల ప్రకారం కొందరి జన్మతేదీలకు చెందిన మూలాంకాలు ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా మూలాంకం 1, 4, 8 ఉన్నవారికి ప్రభుత్వ రంగంలో అవకాశాలు లభించే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

మూలాంకం 1

ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి సూర్యుడు అధిపతిగా భావిస్తారు. సూర్యుడి ప్రభావం వల్ల నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు. మూలాంకం 1 ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే మంచి అవకాశాలు లభించవచ్చని చెబుతారు. ముఖ్యంగా నాయకత్వం, పరిపాలన, అధికారానికి సంబంధించిన ఉద్యోగాల్లో రాణించే సామర్థ్యం ఉంటుందని భావిస్తారు.

మూలాంకం 4

ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4. ఈ సంఖ్యకు రాహువు అధిపతిగా పరిగణిస్తారు. వీరు వేగంగా ఆలోచించే స్వభావం, ప్రత్యేకమైన ఆలోచనా విధానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కృషి చేస్తే పరిపాలనా విభాగాలు, ప్రభుత్వ సేవల్లో ఉన్నత స్థానాలను సాధించే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే లక్ష్యం నుంచి దృష్టి మరలకుండా కృషి చేయడం ముఖ్యమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మూలాంకం 8

ఏ నెలలోనైనా 8, 17 లేదా 26 తేదీల్లో జన్మించిన వారికి మూలాంకం 8 వస్తుంది. ఈ సంఖ్యకు శని గ్రహం అధిపతిగా భావిస్తారు. శని క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, సహనం, బాధ్యతలకు ప్రతీకగా పరిగణించబడతాడు. మూలాంకం 8 ఉన్నవారు తమ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో పనిచేస్తారని, న్యాయం, పరిపాలన, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని సంఖ్యా శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలోని సంఖ్యాశాస్త్ర అంచనాలు సంప్రదాయ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూడదు.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..