AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట..! మాటలతో అందరినీ నమ్మిస్తారట!

సంఖ్యాశాస్త్రం ప్రకారం 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు మూలాంకం 4కు చెందినవారు. వీరికి వ్యూహాత్మక ఆలోచన, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడే నేర్పు ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అవసరమైన సందర్భాల్లో ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు చిన్నచిన్న అబద్ధాలు చెప్పడంలో కూడా వీరు దిట్టలని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు. మాటతీరుతో ఇతరులను ఒప్పించడంలో వీరికి మంచి నైపుణ్యం ఉంటుందని చెబుతున్నారు.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట..! మాటలతో అందరినీ నమ్మిస్తారట!
Numerology
Janardhan Veluru
|

Updated on: Sep 10, 2026 | 6:22 PM

Share

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయవచ్చు. ఇందులో మూలాంకం 4కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెబుతారు. ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31వ తేదీన జన్మించిన వారి మూలాంకం 4గా పరిగణిస్తారు. సంఖ్యా శాస్త్రం మేరకు ఈ మూలాంకంకు రాహువు అధిపతి. మూలాంకం 4 వ్యక్తులు సాధారణంగా రహస్య స్వభావం కలిగి ఉంటారని, పరిస్థితులకు అనుగుణంగా తమ మాటతీరును మార్చుకోగలరు. ముఖ్యంగా తమకు అవసరమైన సందర్భాల్లో విషయాలను నేరుగా చెప్పకుండా, ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాటలను మలచగల సామర్థ్యం వీరికి ఉంటుంది.

మూలాంకం 4 వారికి తమ అభిప్రాయాన్ని ఇతరులపై ప్రభావవంతంగా ఉంచే సామర్థ్యం ఉంటుందని చెబుతారు. ఏ విషయాన్నైనా ఎదుటివారు అంగీకరించేలా వివరించేందుకు ప్రయత్నిస్తారు. పరిస్థితిని బట్టి మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం వీరి ప్రత్యేకతగా పేర్కొంటారు. అందుకే వీరు చెప్పే ప్రతి విషయాన్ని అక్షరాలా నిజమని భావించడం కంటే, పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతారు.

అయితే మూలాంకం 4 వారిని అబద్ధాలకోరని ముద్ర వేయడం సరైనది కాదని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతారు. కొన్ని సందర్భాల్లో సమస్యను పెద్దది కాకుండా చేయడానికి లేదా తమ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి నిజం కాని విషయాన్ని కూడా చాలా సహజంగా చెప్పగలరని భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ విధానం వివాదాలను నివారించడంలో కూడా ఉపయోగపడవచ్చని చెబుతారు.

ఇవి కూడా చదవండి

వ్యూహ రచనలో ముందుంటారు

ఏదైనా పని ప్రారంభించే ముందు దాని లాభనష్టాలను అంచనావేసి ప్రణాళిక రూపొందించడం మూలాంకం 4 వారి మరో లక్షణంగా చెబుతారు. తమ ప్రణాళికకు ఇబ్బంది కలిగించే సమాచారాన్ని వెంటనే బయటపెట్టకుండా గోప్యంగా ఉంచే స్వభావం కూడా ఉండవచ్చని సంఖ్యాశాస్త్రం పేర్కొంటుంది. అందువల్ల మూలాంకం 4 వ్యక్తులను కేవలం ‘అబద్ధాలు చెప్పేవారు’గా చూడకుండా, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచన, మాటతీరుతో సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యం ఉన్నవారిగా చూడవచ్చని చెబుతున్నారు.

గమనిక: ఇవి అంక జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పే సాధారణ వ్యక్తిత్వ విశ్లేషణలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వ్యక్తిత్వ లక్షణాలుగా పరిగణించకూడదు.

Follow Us