AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: పెళ్లి తర్వాత వీరికి అదృష్టం కలిసొస్తుందట..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

వివాహం తర్వాత కొందరి జీవితాల్లో అదృష్టం మరింతగా కలిసొస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, కెరీర్‌లో పురోగతి, కుటుంబ సంతోషం, సామాజిక గౌరవం పెరగడం వంటి శుభ ఫలితాలు లభించే అవకాశముంది. ముఖ్యంగా వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభం రాశుల వారికి పెళ్లి తర్వాత అదృష్టం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందో తెలుసుకోండి.

Lucky Zodiacs: పెళ్లి తర్వాత వీరికి అదృష్టం కలిసొస్తుందట..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Luck After Marriage
Janardhan Veluru
|

Updated on: Sep 10, 2026 | 12:48 PM

Share

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. కొత్త బంధం, కొత్త బాధ్యతలు మాత్రమే కాకుండా.. కొందరి జీవితాల్లో పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంతోషం, సామాజిక గౌరవం కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జీవిత భాగస్వామి సహకారం, కుటుంబంలో పరస్పర అవగాహన కారణంగా కొందరికి అనుకోని అవకాశాలు కూడా లభించే అవకాశముంటుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి వివాహం తర్వాత అదృష్టం మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వృషభ రాశి

వృషభ రాశివారు సాధారణంగా స్థిరత్వం, సహనం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తారని జ్యోతిష్యం చెబుతుంది. వివాహం తర్వాత ఈ లక్షణాలు కుటుంబ జీవితాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశివారికి పెళ్లి తర్వాత జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభించే అవకాశముంటుంది. తమ లక్ష్యాల సాధనలో భాగస్వామి అండగా నిలవడం వల్ల విజయావకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. వివాహానికి ముందు ఎదురైన కొన్ని ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడి భార్యాభర్తల మధ్య అవగాహన మరింత బలపడవచ్చు.

ఇవి కూడా చదవండి

తుల రాశి

తుల రాశివారికి వివాహం తర్వాత కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో అనుకూల పరిణామాలకు ఛాన్స్ ఉంది. కొందరికి పెళ్లి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లేదా మంచి కెరీర్ అవకాశాలు లభించవచ్చు. పిల్లల వల్ల కుటుంబానికి మంచి పేరు, గౌరవం లభించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారు కుటుంబ అవసరాలను అర్థం చేసుకుని ముందుకు సాగేవారిగా జ్యోతిష్యం పేర్కొంటుంది. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశముంది. ఇతరులతో గౌరవంగా వ్యవహరించడం వల్ల సామాజికంగా మంచి పేరు సంపాదించే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత జీవితంలోని వివిధ రంగాల్లో క్రమంగా పురోగతి కనిపించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నాయి.

కుంభ రాశి

కుంభ రాశివారికి వివాహం తర్వాత జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని చెబుతున్నారు. మంచి జీవిత భాగస్వామి లభించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలగవచ్చు. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, కుటుంబంలో ఐక్యత పెరిగితే వివాహ జీవితం మరింత సంతోషంగా సాగుతుందని జ్యోతిష్యం చెబుతోంది.

(గమనిక: ఇవి జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పే సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, ఏడో స్థానం తదితర అంశాల ఆధారంగా ఫలితాలు మారే అవకాశముంది. )

Follow Us