AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ముక్కు మీదే కోపం..! చిన్న విషయాలకే భగ్గుమంటారు!

సంఖ్యాశాస్త్రం ప్రకారం వ్యక్తుల స్వభావం, వ్యక్తిత్వంపై వారు జన్మించిన తేదీ ప్రభావం ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తుల్లో ఆవేశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మరికొందరు సహనం, ఓర్పుతో వ్యవహరిస్తారు. అయితే కొన్ని తేదీల్లో జన్మించిన వారు చిన్న విషయాలకే త్వరగా కోపానికి గురై, సహనం కోల్పోయే అవకాశం ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ముక్కు మీదే కోపం..! చిన్న విషయాలకే భగ్గుమంటారు!
Numerology
Janardhan Veluru
|

Updated on: Sep 08, 2026 | 6:54 PM

Share

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మనం జన్మించిన తేదీ (మూలాంకం) మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తుల్లో కోసం, ఆవేశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మరికొందరికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కొందరు చాలా త్వరగా కోపానికి లోనవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది.

1. మూలాంకం 1 (తేదీలు: 1, 10, 19, 28)

సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలాంకం 1. ఈ మూలాంకానికి సూర్యుడు అధిపతి. వీరికి నాయకత్వ లక్షణాలు (Leadership skills) ఎక్కువ. ప్రతి పని తమ ప్రకారమే జరగాలని కోరుకుంటారు. ఎవరైనా వీరి మాటను జవదాటినా లేదా పనిలో నిర్లక్ష్యం వహించినా వీరి అహం దెబ్బతింటుంది. దీనివల్ల వీరికి వెంటనే తీవ్రమైన కోపం వస్తుంది.

2. మూలాంకం 9 (తేదీలు: 9, 18, 27)

సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినవారి మూలాంకం 9. ఈ మూలాంకానికి కుజుడు అధిపతి. కుజుడు శక్తికి, అగ్నికి సంకేతం. ఈ తేదీల్లో పుట్టిన వారు ధైర్యవంతులు, కానీ వీరికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. ఎదుటివారి అమాయకత్వం లేదా సమాజంలో జరిగే అన్యాయాలను చూస్తే వీరు తట్టుకోలేరు. ఆలోచించకుండా వెంటనే తీవ్రంగా స్పందిస్తారు.

ఇవి కూడా చదవండి

3. మూలాంకం 8 (తేదీలు: 8, 17, 26)

సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినవారి మూలాంకం 8. ఈ మూలాంకానికి శని అధిపతి. ఈ మూలాంకం ఉన్నవారు చాలా గంభీరంగా, న్యాయబద్ధంగా ఉంటారు. చిన్న విషయాలను మనసులోనే దాచుకుని చాలా కాలం పాటు భరిస్తారు. వీరి ఓపిక నశించినప్పుడు వీరి కోపం అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. ఆ సమయంలో వీరిని శాంతపరచడం చాలా కష్టం.

కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి పరిష్కారాలు

మూలాంకం 1: ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యభగవానునికి అర్ఘ్యం (నీరు) సమర్పించాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారి, ఓర్పు పెరుగుతుంది.

మూలాంకం 8: శనివారం రోజున శనిదేవునికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

మూలాంకం 9: వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులు ధరించడం తగ్గించాలి. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం మంచిది.

Disclaimer: ఈ కథనంలోని జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన అంశాలు సాధారణ నమ్మకాలు, అంచనాల ఆధారంగా అందించబడినవి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూడదు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us