AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతువు సంచారం.. ఈ 6 రాశులకు 3 నెలలు గోల్డెన్ టైమ్! ఆకస్మిక ధనలాభాలు, కెరీర్‌లో ప్రమోషన్స్

Ketu Transit Effects Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును నీడ గ్రహంగా పరిగణించినా, సింహరాశిలో దాని సంచారం కొన్ని రాశులకు విశేష ప్రయోజనాలను అందిస్తుంది. రాబోయే మూడు నెలల్లో ఆరు రాశుల వారికి నిలిచిపోయిన పనులు ప్రారంభం, కొత్త అవకాశాలు, ఆర్థిక మెరుగుదల, వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో విజయాలు లభిస్తాయి. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులు ఈ మార్పుల వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతాయి.

Rajashekher G
|

Updated on: Sep 14, 2026 | 8:43 PM

Share
Ketu Transit Effects Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును నీడ గ్రహంగా, రహస్యమైన, ఆధ్యాత్మిక స్వభావం కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా కేతువును అశుభ గ్రహంగా భావించినప్పటికీ.. జాతకంలో అనుకూల స్థానంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభాలు, మానసిక స్పష్టత, ఆధ్యాత్మిక పురోగతితో పాటు వ్యాపార, వృత్తి రంగాల్లో విజయాలను అందించగలడని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే మూడు నెలల కాలంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం, కొత్త అవకాశాలు లభించడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా. ఈ సంచారం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందే ఆరు రాశులు ఏవో చూద్దాం.

1 / 7
మేష రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం అనుకూల ఫలితాలను అందించవచ్చు. ముఖ్యంగా ఐదో ఇంటిపై కేతువు ప్రభావం ఉండటంతో విద్య, పరిశోధన, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పెట్టుబడులు లేదా ఇతర అనూహ్య మార్గాల ద్వారా ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం.

2 / 7
మిథున రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం ధైర్యాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోటీని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ వ్యూహాలు మంచి ఫలితాలను అందించవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మూడు నెలల్లో అనుకూల అవకాశాలు లభించవచ్చని చెబుతున్నారు.

3 / 7
సింహ రాశి: కేతువు నేరుగా సింహరాశిలోనే సంచరిస్తుండటంతో ఈ రాశివారిలో ఆత్మవిశ్లేషణ, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. వ్యక్తిత్వంలో మార్పులు చోటుచేసుకుని నాయకత్వ లక్షణాలు మరింత బలపడే అవకాశం ఉంది. వృత్తి, సామాజిక రంగాల్లో గుర్తింపు పెరగవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి.

4 / 7
తులా రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. పదకొండో ఇంటిపై ప్రభావం కారణంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. పొదుపు పెరగడంతో పాటు పెద్దలు, అన్నదమ్ములు లేదా ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించవచ్చు. చాలా కాలంగా నెరవేరని కొన్ని కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది.

5 / 7
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం అదృష్టాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. తొమ్మిదో ఇంటిపై కేతువు ప్రభావంతో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరగవచ్చు. దూర ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

6 / 7
కుంభ రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఏడో ఇంటి ప్రభావంతో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడటం, పాత వ్యాపార వివాదాలు పరిష్కారం కావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. విదేశీ సంస్థలు, దిగుమతి-ఎగుమతి రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా భాగస్వామితో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా.. కేతువు సంచారం ఈ ఆరు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో భిన్నమైన అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులను బట్టి ఫలితాలు మారవచ్చు. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

కుంభ రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఏడో ఇంటి ప్రభావంతో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడటం, పాత వ్యాపార వివాదాలు పరిష్కారం కావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. విదేశీ సంస్థలు, దిగుమతి-ఎగుమతి రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా భాగస్వామితో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా.. కేతువు సంచారం ఈ ఆరు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో భిన్నమైన అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులను బట్టి ఫలితాలు మారవచ్చు. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

7 / 7
Follow Us