చాణక్య నీతి : జాగ్రత్త వీరు పాము కంటే విషపూరితమైన వారు
Samatha
16 september 2026
Pic credit - Pinterest
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అంతే కాకుండా చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా బంధాలు ,బంధుత్వాల గురించి కూడా తెలియజేసిన విషయం తెలిసిందే.
బంధాలు, బంధత్వాలు
అదే విధంగా కొంత మందిని అస్సలే నమ్మకూడదు, వారు పాము కంటే కూడా చాలా ప్రమాదకరమైన వారు అని తెలిపారు. వారు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
కొందరు వ్యక్తులు
ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ, కొంత మంది ముఖంపైకి నవ్వుతూ మాట్లాడినప్పటికీ, వెనకాల గోతులు తవ్వుతారు అలాంటి వారితో జాగ్రత్త అని తెలియజేయడం జరిగింది.
నవ్వుతూ మాట్లాడే వారు
ఈర్ష్యా అసూయ కలవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదంట.
ఈర్ష్యా అసూయ
అలాగే స్వార్థపరులు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే బంధాలను ఏర్పరుచుకునేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు తమ స్వార్థం కోసం ఏదైనా చేస్తారంట.
స్వార్థపరులు
అంతే కాకుండా కొందరు ముఖంపైకి నవ్వుతూ కనిపించినప్పటికీ, మీకు తెలియకుండా మీ వెనకే గోతులు తవ్వుతారు, అందువలన ఎప్పుడూ నవ్వుతూ తియ్యగా మాట్లాడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంట.
నవ్వుతూ మాట్లాడే వారు
అలాగే కొంత మంది కేవలం మీ వద్ద ఉన్న డబ్బు, పరపతి చూసే మీతో నవ్వుతూ మాట్లాడుతుంటారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉండాలంట.