Pavan Sadineni: పోలీసుల అదుపులో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?
టాలీవుడ్ లో విభిన్నమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్లలో పవన్ సాధినేని ఒకరు. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి సినిమాలు తీసిన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ నటి ఆరోపించడంతో పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ ఇప్పుడిలా అరెస్ట్ కావడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా మందిలాగే యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు పవన్ సాధినేని. ఇంటర్వ్యూ , లవ్ ఫార్ములా 31 , బేవార్స్ తదితర షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాలగ్ గా పది లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ 2013లో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ ఇష్క్ కాదల్ అంటూ ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. హర్షవర్ధన్ రాణే, హరీశ్ వర్మ, శ్రీ విష్ణు, రీతూ వర్మ, శ్రీముఖి, వితికా షేరు వంటి స్టార్స్ తో రూపొందిన ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత నారా రోహిత్ తో కలిసి సావిత్రి అనే సినిమాను తెరకెక్కించాడు. అలాగే రాజేంద్రప్రసాద్ తో కలిసి తెరకెక్కించిన సేనాపతి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాలతో పాటు పిల్, ఈ- ఆఫీస్ లో, కమిట్మెంటల్, దయా వంటి వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించాడు పవన్.
ప్రస్తుతం మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ సల్మాన్ తో కలిసి ఆకాశంలో ఒక తార అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పవన్ సాధినేని. సాత్విక వీరవల్లి పూజా హెగ్డే, శృతి హాసన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇదివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ కూడా సినీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంతలోనే పవన్ అరెస్ట్ కావడం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పవన్ సాధినేని ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




