AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెసరపప్పుతో అరగంటలో.. జ్వరం తగ్గించే చిట్కా..!

ఈ మధ్య కాలంలో.. ఏ ఆస్పత్రి చూసినా.. నిండుగా జనాలు దర్శనమిస్తున్నారు. పడిపోయే స్టేజ్‌లో వున్నా.. గంట, రెండు గంటలు వేచి చూడాల్సిందే.. ఎందుకంటే.. ఎవరి అర్జెంట్ వారిదేగా. అసలు ఈ ఫీవర్ ఎలా వస్తుందంటే.. సాధారణంగానే.. మన బాడీలో వేడి సరిపడనంతగా ఉంటుంది. అది పెరిగితే.. జ్వరం.. అన్నమాట. అదే 100 డిగ్రీస్ దాటితే.. ఇక మంచానికి అతుక్కోని ఉండాల్సిందే. అలాంటప్పుడు.. ఏమీ తినాలనిపించదు. కానీ.. తినకపోతే.. వ్యాధినిరోధక శక్తి ఇంకా క్షీణిస్తుంది. అప్పుడు ఇంకా […]

పెసరపప్పుతో అరగంటలో.. జ్వరం తగ్గించే చిట్కా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 08, 2019 | 3:00 PM

Share

ఈ మధ్య కాలంలో.. ఏ ఆస్పత్రి చూసినా.. నిండుగా జనాలు దర్శనమిస్తున్నారు. పడిపోయే స్టేజ్‌లో వున్నా.. గంట, రెండు గంటలు వేచి చూడాల్సిందే.. ఎందుకంటే.. ఎవరి అర్జెంట్ వారిదేగా. అసలు ఈ ఫీవర్ ఎలా వస్తుందంటే.. సాధారణంగానే.. మన బాడీలో వేడి సరిపడనంతగా ఉంటుంది. అది పెరిగితే.. జ్వరం.. అన్నమాట. అదే 100 డిగ్రీస్ దాటితే.. ఇక మంచానికి అతుక్కోని ఉండాల్సిందే. అలాంటప్పుడు.. ఏమీ తినాలనిపించదు. కానీ.. తినకపోతే.. వ్యాధినిరోధక శక్తి ఇంకా క్షీణిస్తుంది. అప్పుడు ఇంకా సీరియస్ అయ్యే ప్రమాదం లేకపోదు.

Moong Dal can Reduce Body Heat of Fever patient past with this a Small Trick

అయితే.. పెసరపప్పుతో ఇలా ఒక చిట్కా పాటిస్తే.. కనుక కాస్త ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జ్వరం తీవ్రతను బట్టి.. ఎక్కువగా ఉంటే.. ఓ 20 నిమిషాలు.. తక్కువగా ఉంటే.. 15 నిమిషాలు పెసర పప్పును ఓ కప్పు నీటిలో నానబెట్టి.. ఆ వాటర్‌ను తాగితే.. జ్వరం వేడి తగ్గుతుందని.. అప్పుడు ఏదైనా అల్పాహారం తీసుకుంటే.. ఎనర్జీ లెవల్స్ మెరుగుపడతాని చెబుతున్నారు. అసలే ఇప్పుడు జ్వరాలు.. ఎక్కువవుతున్నాయి. ఎన్నో ట్రై చేస్తూవుంటారు కదా.. ఇదీ ఒకసారి ట్రై చేయండి మరి. అంతేకాకుండా.. పెసరపప్పుతో సూప్‌ చేసుకుని.. ఈ వింటర్, రెయిన్ సీజన్‌లో తాగుతూ వుంటే మంచిది.

Moong Dal can Reduce Body Heat of Fever patient past with this a Small Trick