అజీర్ణం సమస్యతో బాధపడుతున్నారా ?
అజీర్తి సమస్యలు.. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సర్వసాధారణమైన సమస్య ఇది. ఆకలి మందగించడం, ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, ఇలాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీనికి కారణాలేంటీ? అసలు ఈ అజీర్తి సమస్య ఎందుకు వస్తుంది? మనం తిన్నది అరిగే శక్తి కూడా మనలోపల ఉన్నజీర్ణ వ్యవస్తకు ఉన్నపుడు ఎలాంటి సమస్య రాదు. కానీ దీనికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే కంగారు పడదాం. అజీర్తి: అరుగుదల మందగించడం మూలంగా తలెత్తే […]

అజీర్తి సమస్యలు.. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సర్వసాధారణమైన సమస్య ఇది. ఆకలి మందగించడం, ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, ఇలాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీనికి కారణాలేంటీ? అసలు ఈ అజీర్తి సమస్య ఎందుకు వస్తుంది? మనం తిన్నది అరిగే శక్తి కూడా మనలోపల ఉన్నజీర్ణ వ్యవస్తకు ఉన్నపుడు ఎలాంటి సమస్య రాదు. కానీ దీనికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే కంగారు పడదాం.
అజీర్తి:
అరుగుదల మందగించడం మూలంగా తలెత్తే అజీర్తి సమసయ్య వస్తుంది. దీంతో అల్సర్లు, గాల్‌బ్లాడర్ వ్యాధులు కూడా ప్రారంభమవుతాయి. అయితే అజీర్తి అనేది మళ్లీ మళ్లీ వస్తూ ఉంటే చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అజీర్తి సమస్యతో పొట్టలో మంట, పొత్తికడుపు నొప్పి, విపరీతంగా త్రేన్పులు, వాంతులు, కడుపులో గుటగుట శబ్దాలు వస్తాయి.
దీనికి కారణాలు: తిన్న ఆహారం అరిగేందుకు కనీసం 4 గంటల సమయం పడుతుంది. కానీ సమయం దాటకుండా తింటూ ఉంటే అజీర్తి సమస్య వస్తుంది. అవసరానికి మించి తిన్నా, వేళతప్పి తిన్నా, లేకు ఆహారాన్ని నమలకుండా తిన్నా, ఒత్తిడితో తిన్నా ఇవన్నీ అజీర్తి సమస్యలకు దారితీస్తాయి.
పరిష్కారాలు:
మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. తిన్న తర్వాత నీల్లు తాగాలి, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. భోజనానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు అస్థవ్యస్థమవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడే మాత్రమే తినాలి.
అజీర్తితో అసిడిటీ, మలబద్దకం, ఆకలి మందగించడం, వంటి సమస్యలు కూడ వేధిస్తాయి. అజీర్తి సమస్యకు సులువైన పరిష్కారాలు
బెల్లం:
అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్నం బెల్లం ముక్కను బోజనం చేసిన తర్వాత ప్రతిసారి నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా జీర్ణం అవుతుంది.
నీరు:
నీటిని అధికంగా తాగడం వల్ల అసిడిటీ సమస్యను నుంచి బయటపడొచ్చు. అప్పటి వరకు జీర్ణం కాకుండా ఉన్న పదార్ధాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.
సోంపు:
అజీర్ణం సమస్యకు సోంపు గింజలు మంచి పరిష్కారాన్ని ఇస్తాయి. 1 టీస్పూన్ సోంపును భోజనం తర్వాత తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగు: అజీర్ణానికి మంచి ఉపశమనాన్ని ఇచ్చేది పెరుగు. కీర దోస ముక్కలు, కొత్తిమీరను పెరుగులో వేయాలి, ఈ మూడింటినీ భోజనం తర్వాత తాగితే అసలు ఎలాంటి అజీర్ణ సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయి.