Diabetes Control Tips: ఎంతకీ షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా.. ఈ గింజలు తింటే చాలు!
డయాబెటీస్‌కి ఇంకా ఎలాంటి చికిత్స రాలేదు. కాబట్టి కేవలం ఆహార పదార్థాల ద్వారానే షుగర్ వ్యాధినిక కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకున్నా షుగర్ కంట్రోల్ కాకపోతే.. ఇప్పుడు చెప్పిన విధంగా ఈ గింజలు తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి..
ఇటీవల కాలంలో షుగర్ వ్యాధితో పోరాడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి ఎటాక్ చేస్తుంది. ఇందుకు ముఖ్య కారణం తినే ఆహారపు అలవాట్లు. కొన్ని ఇతర కారణాల వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఇంకా ఎలాంటి మెడిసిన్స్ రాలేదు. కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోవాలి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఇప్పటికే ఎన్నో చిట్కాలు తెలుసుకున్నాం. కానీ ఇంకా షుగర్ అదుపులో ఉండటం లేదు అనేవాళ్ల కోసం మరిన్ని రెమిడీలు మీ ముందుకు తీసుకొచ్చాం. మధుమేహానికి చికిత్స లేకపోయినా.. కంట్రోల్ చేసుకునే సామర్థ్యం మాత్రం మన చేతుల్లోనే ఉంది. షుగర్‌ను కంట్రోల్ చేయడంలో చియా సీడ్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి చియా సీడ్స్‌తో ఎలా షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్‌లో పోషకాలు:
చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఆరోగ్యకరమైన పోషకాలు లభిస్తాయి. ఓమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.
ఇలా తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్..
* చియా సీడ్స్‌ని ఎలా తీసుకున్న బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఉదయం పూట మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు.
* నీటిలో కూడా కలిపి చియా సీడ్స్ తీసుకుంటే చాలా మంచిది.
* సలాడ్స్‌లో, స్నాక్స్ ద్వారా, జ్యూసెస్, కొబ్బరి బొండాలు, డ్రై ఫ్రూట్స్ ఇలా వేటితో కలిపి తీసుకున్నా మంచి రిజల్ట్స్ ఉంటాయి.
* పాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. మిల్క్ షేక్స్, పాయసాలు వంటి వాటిపై కూడా చల్లి చియా సీడ్స్ తీసుకోవచ్చు.
ఇలా కంట్రోల్ అవుతుంది..
చియా సీడ్స్‌లో ఉండే అల్ఫా లినోలెనిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తిన్న వెంటనే ఆహారంలో గ్లూకోజో లెవల్స్‌ను పెంచదు. కాబట్టి షుగర్ లెవల్స్ అనేవి పెరకుండగా కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే వీటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఈ చియాసీడ్స్‌ను వెంటనే తీసుకునే బదులు నీటిలో లేదా మజ్జిగలో, పాలలో ఎలా తీసుకున్నా ఓ ఐదు నుంచి పది నిమిషాలు నానబెట్టి తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.