Winter Care Health Tips: శీతాకాలంలో జలుబు, దగ్గు బారిన పడకుండా.. పసుపుతో ఈ చిన్న పని చేస్తే చాలు.. రోగాలు దూరం

శీతాకాలం వస్తూనే అనేక ఆరోగ్య సమస్యలను తెస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో శీతాకాలం రాకముందే సింపుల్ టిప్స్ తో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పసుపు, తేనెను ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పసుపు, తేనే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Surya Kala

|

Updated on: Nov 07, 2024 | 12:20 PM

శీతాకాలం వచ్చేసింది. కొంతమందికి శీతాకాలం అంటే చాలా ఇష్టం. ఈ సీజన్ ఎండ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అదే సమయంలో అనేక ఆరోగ్య సవాళ్లను తెస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే జలుబు, వైరల్ సమస్యలతో ఇబ్బందిపడుతూనే ఉంటారు.

1 / 6
పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ మాట్లాడుతూ శీతాకాలంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని వీలైనంత వరకు పెంచుకోవాలని చెప్పారు. ఇందు కోసం వంటగదిలోని మసాలా దినుసు పసుపును ఉపయోగించవచ్చు. పసుపులో యాంటీవైరల్ ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఆయుర్వేదంలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది.

2 / 6
పసుపు, తేనె కలయిక: నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలం రాకముందే తేనె, పసుపు తినాలి. పూర్వకాలం నుంచి ఇంటి నివారణల చిట్కాలుగా తేనె, పసుపును ఉపయోగిస్తున్నారు. బాక్టీరియల్,  వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు, తేనె తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నమామి అగర్వాల్ చెప్పిన సలహాలు తెలుసుకుందాం..

3 / 6

రోగనిరోధక శక్తి: తేనె, పసుపు రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్, ఒత్తిడితో పోరాడడంలో సహాయపడతాయి. ఒక చెంచా తేనె, పసుపు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్, ఫ్లూని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 6

జీర్ణవ్యవస్థ బలంగా: చలికాలం ముందు జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుకోవాలనుకుంటే పసుపు, తేనె ఉత్తమ ఎంపిక. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా తేనె, పసుపు కలిపి తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

5 / 6
గుండె ఆరోగ్యం కోసం: తేనె, పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పసుపు హృదయనాళ వ్యవస్థ, ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

6 / 6
Follow us