- Telugu News Photo Gallery Cinema photos Citadel Honey Bunny review in telugu starring Samantha Ruth Prabhu and Varun Dhawan
Citadel Honey Bunny: సిటాడెల్ లో సమంత మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. ట్విట్టర్ రివ్యూ ఇదే..
Citadel Honey Bunny Review: ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే అయితే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. హాలీవుడ్‌లో ప్రముఖ నటుడు రిచర్డ్ మ్యాడెన్, హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ నటించిన వెబ్ సిరీస్‌కు ఇండియన్ వెర్షన్ అనే విషయం తెలిసిందే.
Updated on: Nov 07, 2024 | 12:01 PM

అయితే సమంతా కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ వెబ్ సిరిస్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఈ వెబ్ సిరిస్ కు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి .. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరిస్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని చేసినట్లు సామ్ చెప్పారు. ఈ క్రమంలో నెటిజన్లు,సినీ ప్రముఖులు చేసిన ట్విట్ల వివరాల్లోకి వెళితే..

సిటాడెల్ హానీ బన్నీ సిరీస్ ప్రీమియర్‌ను ముంబైలో సినీ తారలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.. అయితే ప్రీమియర్ ను చూసేందుకు సినీ స్టార్స్ భారీగా తరలి వచ్చారు. చూసిన స్టార్స్ అందరు వారి వారి రివ్యూస్ అందించారు..

చూసిన స్టార్స్ లో ఒకరైన నిమ్రత్ కౌర్ తన అభిప్రాయాన్నీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.. సిటాడెల్ హానీ బన్నీ మైండ్ బ్లోయింగ్ సిరీస్ అని చూస్తే పిచ్చెక్కిపోతుంది.. ప్రతీ క్షణం కొత్త అనుభూతిని పొందాను అని.. చూసినంతసేపు మంచి థ్రిల్లింగ్ ఉంటుంది అని ఆమె పోస్టు చేశారు.

ఈ వెబ్ సిరీస్‌లో సమంత యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమే కాదు.. రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చాలా అద్భుతంగా నటించిందట.. వరుణ్ ధావన్‌తొ కలిసి చేసిన కొన్ని సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

సిటాడెల్ మూవీలో వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు మధ్య కెమిస్ట్రీ చేస్తే మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ మీకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సమంత పవర్‌ఫుల్ రోల్, వరుణ్ ధావన్ మ్యాగ్నటిక్ చార్మ ఆకట్టుకొనేలా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.




