తొక్కే కదా అని తీసిపారేయకండి.. ఎన్ని లాభాలో తెలిస్తే

02 January 2025

Ravi Kiran

నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి. నారింజ పండ్లే కాదు, దాని గింజలు, తొక్క కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 

ఆరెంజ్ పీల్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరెంజ్ తొక్క చర్మం, శ్వాసకోశ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. 

చలికాలంలో నారింజ పండ్లను ఇంటికి తెచ్చుకుంటే, వాటిపై తొక్కను మర్చిపోకుండా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుంది. 

నారింజ తొక్కలో ఉండే మినరల్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. దీని తొక్కలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

నారింజ తొక్కలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి6, కాల్షియం వంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

ఆరెంజ్ పీల్స్ లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. లిమోనెన్ వంటి రసాయన సమ్మేళనాలు నిండుగా ఉంటుంది. 

నారింజ తొక్క రుచికి చేదుగా ఉంటుంది. ఇలా కాకుండా నేరుగా తినడానికి బదులు నారింజ తొక్కను వేడి నీటిలో వేసి బాగా కడగాలి.

ఆ తర్వాత నారింజ తొక్కలను చిన్న ముక్కలుగా కట్‌చేసి సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, స్మూతీస్ వంటి మొదలైన వాటితో కలిపి నేరుగా తినవచ్చు.