Hair Care Tips: ఆరోగ్యకరమైన కురుల కోసం ఈ మూడింటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే!

ఒత్తైన, పొడవైన కురులు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Hair Care Tips: ఆరోగ్యకరమైన కురుల కోసం ఈ మూడింటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే!
Hairfall
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 20, 2021 | 3:07 PM

ఒత్తైన, పొడవైన కురులు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు, ప్రెగ్నెన్సీ, వృద్ధాప్య సమస్యలు, ఇప్పుడు పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో చాలామంది హెయిర్ ఫాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరికొంతమంది చుండ్రు, జుట్టు పొడిబారడం, నెరిసిపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజా ఆరోగ్యమైన కురుల కోసం కొన్ని చిట్కాలు పంచుకున్నారు.

డైట్‌లో ఇవి ఉండాల్సిందే! ప్రొటీన్లు, విటమిన్లు- ఎ, సి, ఈ, ఫోలేట్‌, ఐరన్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ పోషకాలుండే గుడ్లు, కూరగాయలు, పండ్లు, నట్స్‌ను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ‘మన వెంట్రుకలు ఏడాదిలో ఆరు అంగుళాలు పెరుగుతాయి. అయితే అది మన జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది’ అని ఇన్‌స్టా వీడియోలో చెప్పుకొచ్చిన పూజ… శిరోజాల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన మూడు ఆహార పదార్థాలను పంచుకున్నారు.

ఉసిరి ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా కొల్లాజెన్‌ను ఉత్పత్తిని పెంచి శిరోజాలకు బలం చేకూరుస్తుంది. ఇందులోని ప్రొటీన్లు శిరోజాల్లోని మృత కణాలను తొలగించి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి.

అవిసె గింజలు అందమైన, ఆరోగ్య కురులను సొంతం చేసుకోవాలంటే అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను తీసుకుంటే 6400 మిల్లీగ్రాముల ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఇవి జుట్టు కుదళ్లను దృఢంగా చేయడమే కాకుండా శిరోజాలు వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. ఇది పలు అధ్యయనాల్లో కూడా రుజువైంది.

కరివేపాకు కరివేపాకులో బీటా కెరోటిన్‌, విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని అందించడంతో పాటు శిరోజాలను మెరిసేలా చేస్తాయి. కరివేపాకు జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు నెరవడం, చుండ్రు తదితర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Read Also: మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారికి దివ్య ఔషధం.. క్రాన్‌బెర్రీ జ్యూస్ అంటున్న వైద్యులు..

నల్ల వెల్లుల్లితో దివ్యమైన లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!