Bad Food Combinations: ఈ కాంబినేషన్‌లో ఫుడ్స్ తీసుకుంటే అంతే సంగతులు! అవేంటో తెలుసా..?
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ...

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది ఫుడ్ విషయంలో అలక్ష్యం పాటిస్తున్నారు. యాంత్రిక జీవనంలో పడిపోయి ఏది పడితే అది తింటున్నారు. ఇక కొన్ని ఆహార పదార్థాలు అన్నం తినడానికి ముందు, భోజనం చేసిన తర్వాత అసలు తినకూడదు. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తినకూడదు. అయితే అవగాహన లేమితో చాలామంది వివిధ రకాల కాంబినేషన్లలో ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఫలితంగా చేజేతులా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు దిక్సా భావ్సర్ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఫుడ్ కాంబినేషన్ల గురించి షేర్ చేసుకున్నారు.
పాలు, చేపలు ఆయుర్వేదం ప్రకారం పాలు, చేపలు పరస్పర విరుద్ధ ఆహార పదార్థాలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తం విషుతుల్యమవుతుంది. శరీర విధులకు ఆటంకం కలుగుతుంది.
అరటి, పాలు, పెరుగు, మజ్జిగ బనానా మిల్క్‌షేక్ లేదా స్మూతీలను చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. క్రీడాకారులు కూడా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి వీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే పరస్సర విరుద్ధ ఆహార పదార్థాలైన అరటి పండ్లు, పాలను కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అంతమంచిది కాదంటున్నారు దిక్సా. అరటి పండ్లను పాలతోనే కాదు పెరుగు, మజ్జిగతో కూడా కలిపి తీసుకోకూడదట. ఈ కాంబినేషన్లతో ఆహారం తీసుకుంటే శరీరంలో ట్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయట. అదేవిధంగా దగ్గు, జబులుతో పాటు వివిధ రకాల అలర్జీలు ఇబ్బంది పెడతాయట.
పెరుగు, వెన్న సాధారణంగా పెరుగు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అదేవిధంగా రక్త, పిత్త, కఫాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇక వెన్న జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనిని మోతాదుకు మించి తీసుకుంటే మలబద్ధకం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే జీర్ణ సమస్యలున్న వారు ఈ రెండింటిని కలిపి అసలు తీసుకోకూడదు. ఇక పెరుగును శీతాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి సమయాల్లో పూర్తిగా దూరం ఉంచాలి.
తేనె, నెయ్యి ఆయుర్వేదం ప్రకారం తేనె వేడి స్వభావం కలిగి ఉంటుంది. అదే సమయంలో నెయ్యి చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. ఇలా పరస్పర విరుద్ధ స్వభావాలున్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో విషతుల్య పదార్థాలు ఏర్పడతాయి. శరీర విధులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.
Read Also: మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారికి దివ్య ఔషధం.. క్రాన్‌బెర్రీ జ్యూస్ అంటున్న వైద్యులు..
నల్ల వెల్లుల్లితో దివ్యమైన లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?