AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hing Water Benefits: పరగడుపున ఇంగువ నీరు తాగండి..! శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలని తొలగించుకోండి..

Hing Water Benefits: భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి లేనిదే వంటలు చేయడం అసాధ్యం.

Hing Water Benefits: పరగడుపున ఇంగువ నీరు తాగండి..! శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలని తొలగించుకోండి..
Asafoetida Water
uppula Raju
|

Updated on: Oct 20, 2021 | 5:33 PM

Share

Hing Water Benefits: భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి లేనిదే వంటలు చేయడం అసాధ్యం. అలాంటి సుగంధ ద్రవ్యాలలో ఇంగువ ఒకటి. దీనికి చాలా చరిత్ర ఉంది. సనాతన ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడేవారు. ఔషధాల తయారీలో ఉపయోగించేవారు. ఇంగువలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజు పరగడుపున గ్లాసు వేడి నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకొని తాగితే చాలా ఆరోగ్య సమస్యలు తగ్గించవచ్చు. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో ఇంగువ చక్కగా ఉపయోగపడుతుంది. ఇంగువను తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ నుంచి హానికరమైన విషపదార్థాలన్ని బయటకు వెళుతాయి. కడుపు pH స్థాయిని సాధారణం చేస్తుంది.

2. బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇంగువ వాటర్ మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. బరువ తగ్గడంలో తోడ్పడుతుంది.ఇది మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగిస్తుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. చలి నుంచి రక్షిస్తుంది శీతాకాలంలో జలుబు చేస్తే అసఫెటిడా నీటిని తాగండి. ఇది శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. చలి నుంచి కాపాడుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

4. తలనొప్పిని తగ్గిస్తుంది ఇంగువలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని తగ్గిస్తాయి. రక్తనాళాల వాపును తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజు అసఫెటిడా నీరు తాగండి.

5. మహిళల సమస్యలు మహిళలు కొన్నిసార్లు రుతుస్రావపు నొప్పిని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. వెన్నెముక, పొత్తి కడుపు నొప్పిని వదిలించుకోవడానికి ఇంగువ ఒక గొప్ప నివారణ. ఇది శరీరంలో రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయపడుతుంది. ఇది పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Social Media: సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. కంపెనీలు కంటెంట్ మొత్తానికి బాధ్యత వహించాల్సిందే.. కేంద్ర ప్రభుత్వ కసరత్తులు!

CM KCR: తాట తీయండి.. డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి.. సీఎం కేసీఆర్‌ సంచలన ఆదేశాలు..

Samantha: ఆ యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా.. వివరాలివే..