AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అక్కడెలా పెట్టార్రా.. ఎత్తుగా కనిపించిన బైక్‌ సీట్.. ఏంటని తనిఖీ చేయగా..

కొన్ని ఘటనలు అనుభవాలను పంచుతాయి. మరికొన్ని విజ్ఞానాన్ని అందించి జీవితంలో ఉన్నతికి కారణహేతువుగా మారుతాయి. అయితే ప్రస్తుతం సినిమాలు, నాటికలు, వివిధ మాద్యమాల ప్రభావం సమాజంపై పడుతుందని, అబ్బే అలాంటిది ఏమీ లేదని ఇలా విభిన్నంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే యదార్థ ఘటనల ఆధారంగా కథలు పుట్టు కువచ్చాయనేది ఎంత నిజమో., వాటి ప్రభావం సమాజంపై ఉంటుందనేది కూడా అంతే నిజం.

Watch Video: అక్కడెలా పెట్టార్రా.. ఎత్తుగా కనిపించిన బైక్‌ సీట్.. ఏంటని తనిఖీ చేయగా..
Eluru District Ganja Arrest
B Ravi Kumar
| Edited By: |

Updated on: Dec 28, 2025 | 9:10 PM

Share

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అచ్చం సినిమా స్టైల్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరు వ్యక్తుల్ని చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట జాతీయ రహదారిపై జీలుగుమిల్లి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడం పోలీసులు గమనించారు. దీంతో వాళ్ల బైక్‌ను అడ్డుకున్నారు. అయితే సీటు ఎత్తుగా కనిపించడంతో ఏంటా అని తనిఖీ చేశారు.

ఇంకేముంది బైక్ సీటు కింద గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఇద్దరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒరిస్సా పరిసర ప్రాంతాలలో గంజాయిని సేకరించి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి తరలిస్తున్నట్లు తెలిసింది. నిందితుల వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయితో పాటు, బైకు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.