AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలం బరువు తగ్గాలనుకుంటున్నారా..! ఈ కూరగాయలను డైట్‌లో చేర్చండి..

Weight Lose Tips: చలికాలం ప్రారంభమైంది. ఈ కాలంలో బరువు తగ్గాలనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ బద్దకం ఎక్కువగా

చలికాలం బరువు తగ్గాలనుకుంటున్నారా..! ఈ కూరగాయలను డైట్‌లో చేర్చండి..
Vegetables Diet
uppula Raju
|

Updated on: Oct 20, 2021 | 6:37 PM

Share

Weight Lose Tips: చలికాలం ప్రారంభమైంది. ఈ కాలంలో బరువు తగ్గాలనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ బద్దకం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వర్కవుట్ చేయడానికి దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీరు డైట్‌లో ఈ కూరగాయలను చేర్చితే సరిపోతుంది.ఈ కూరగాయల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఈ సీజన్‌లో సులభంగా లభిస్తాయి. అలాగే వీటిని సలాడ్, సూప్, జ్యూస్, వెజిటబుల్, పుడ్డింగ్, స్టఫ్డ్ పరాఠా వంటి విభిన్న వంటకాల రూపంలో తినవచ్చు. ఒక్కసారి ఆ కూరగాయల గురించి తెలుసుకుందాం.

1. బఠానీ బరువు తగ్గించడంలో బఠానీ చాలా ముఖ్యమైనది. ఇందులో చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. అదే సమయంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. శీతాకాలంలో బఠానీలను డైట్‌లో చేర్చుకోవచ్చు.

2. ముల్లంగి ముల్లంగి తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మీ శరీరానికి అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ముల్లంగి తినడం వల్ల మీకు ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. దీనివల్ల మళ్లీ మళ్లీ తినే అలవాటును తగ్గించుకుంటారు.

3. పాలకూర పాలకూర బరువు తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎ, సి, కె వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

4. బీట్‌రూట్ బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం ద్వారా రక్తం వేగంగా పెరగడమే కాకుండా ఇందులో ఉండే పోషకాలు చాలా ప్రయోజనాలను అందిస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్, మెగ్నీషియం, అనేక రకాల విటమిన్లు బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

5. క్యారెట్‌ బరువును తగ్గించుకోవడానికి మీరు క్యారెట్లను కూడా తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడటమే కొవ్వును బర్న్‌ చేసే గుణం కలిగి ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.

Salaar Movie : ప్రభాస్ సినిమా నుంచి లీకైన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

Mobile Banking: మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే మూడొంతుల లావాదేవీలు.. డిమాండ్ పడిపోయిన ఏటీఎంలు..

Sadha: ఎర్రాని.. కుర్రది సదా వయ్యారాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..