AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Banking: మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే మూడొంతుల లావాదేవీలు.. డిమాండ్ పడిపోయిన ఏటీఎంలు..

మొబైల్ సేవల ద్వారా ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడం దేశంలోని లావాదేవీల పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఏటీఎం(ATM) నుండి డబ్బు విత్‌డ్రా చేయడం ద్వారా నగదు వినియోగం నిరంతరం తగ్గుతోంది.

Mobile Banking: మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే మూడొంతుల లావాదేవీలు.. డిమాండ్ పడిపోయిన ఏటీఎంలు..
Mobile Banking
KVD Varma
|

Updated on: Oct 20, 2021 | 6:17 PM

Share

Mobile Banking: మొబైల్ సేవల ద్వారా ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడం దేశంలోని లావాదేవీల పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఏటీఎం(ATM) నుండి డబ్బు విత్‌డ్రా చేయడం ద్వారా నగదు వినియోగం నిరంతరం తగ్గుతోంది. మరోవైపు మొబైల్ బ్యాంకింగ్.. మొబైల్ వాలెట్ లావాదేవీలు వేగంగా పెరిగాయి. గత ఏడు సంవత్సరాలలో, మొబైల్ బ్యాంకింగ్ చివరి స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకుంది.

మొబైల్ బ్యాంకింగ్ 65.8% వాటా..

రిజర్వు బ్యాంకు డాటా ప్రకారం, మొబైల్ బ్యాంకింగ్ అత్యధికంగా 65.8% పెరిగింది. ఈ సంవత్సరం మార్చి చివరిలో బ్యాంకు ఖాతాల నుండి మొత్తం లావాదేవీల్లో వాటా లెక్క ఇది.15.9% లావాదేవీలు మాత్రమే ఏటీఎంల ద్వారా జరిగాయి. మొబైల్ వాలెట్ 10.4% లావాదేవీలతో మూడో స్థానంలో..POS (పాయింట్ ఆఫ్ సేల్) 8% కంటే తక్కువ లావాదేవీలతో నాల్గవ స్థానంలో నిలిచింది. లావాదేవీల పరంగా, 2014 వరకు పరిస్థితి చాలా విరుద్ధంగా ఉంది. అప్పుడు 5 లో 4 లావాదేవీలు ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవడం ద్వారా జరిగాయి. ఆర్బీఐ డేటా ప్రకారం, 2014 లో మొత్తం లావాదేవీలలో (సంఖ్యల పరంగా) అత్యధికంగా 82.1% వాటాను ఏటీఎంలు కలిగి ఉన్నాయి.

విలువ పరంగా కూడా..

అత్యధిక లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయి. డేటా ప్రకారం, అత్యధిక మొత్తంలో లావాదేవీలు కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు మొబైల్ బ్యాంకింగ్ అత్యధికంగా 71% లావాదేవీలను కలిగి ఉంది. 22.6% లావాదేవీలతో ఏటీఎం రెండవ స్థానంలో ఉంది. 5.2% లావాదేవీలతో POS మూడవ స్థానంలో నిలిచింది. కేవలం 1.2% లావాదేవీలు మాత్రమే మొబైల్ వాలెట్ల ద్వారా జరిగాయి. 2014 వరకు పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. అత్యధికంగా 87.7% లావాదేవీలు ఏటీఎంల ద్వారా జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 1% లావాదేవీలు మాత్రమే జరిగాయి.

లావాదేవీల ధోరణి ఇలా మారింది

  • మొబైల్ బ్యాంకింగ్ 2014 నుండి క్రమంగా పెరిగింది, కానీ 2019 నుండి విజృంభించింది.
  • 2017 నుండి ఏటీఎంల ద్వారా లావాదేవీలు ఏటా 10% తగ్గుతూ వస్తున్నాయి.
  • మొబైల్ వాలెట్ వినియోగం 2014-2018 నుండి పెరిగింది. తరువాత తగ్గుదల ప్రారంభమైంది.
  • 2019 నుండి POS లావాదేవీలలో స్థిరమైన క్షీణత ఉంది, అంతకు ముందు పెరిగింది.

ఇవి కూడా చదవండి: Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..

Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్.. ఆన్‌లైన్‌లో మీరూ పాల్గొనవచ్చు ఇలా!

India vs Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన దుబాయ్.. కాశ్మీర్‌‌లో మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు!

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..