India vs Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన దుబాయ్.. కాశ్మీర్‌లో మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు!
కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ముస్లిం దేశాల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. ఈ విషయంలో భారత్ పాక్ పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ముస్లిం దేశాలు పాకిస్తాన్ కు ఏమాత్రం మద్దతు ఇవ్వకుండా చేయడంలో దౌత్యపరంగా భారత్ విజయం సాధించింది.
India vs Pakistan: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ముస్లిం దేశాల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. ఈ విషయంలో భారత్ పాక్ పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ముస్లిం దేశాలు పాకిస్తాన్ కు ఏమాత్రం మద్దతు ఇవ్వకుండా చేయడంలో దౌత్యపరంగా భారత్ విజయం సాధించింది. మరోవైపు పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అనేక విజ్ఞప్తులు చేసిన తర్వాత కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కశ్మీర్ సమస్యపై ఏ మాత్రం జోక్యం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ సమస్యపై యుఎఇ, బంగ్లాదేశ్‌తో సహా చాలా ముస్లిం దేశాల మద్దతు పాకిస్తాన్ కు అందడం లేదు. ఇప్పుడు దుబాయ్ భారతదేశానికి అనుకూలంగా ప్రధాన నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దుబాయ్ పాకిస్థాన్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.
ఆర్టికల్ 370 రద్దు చేసిన దాదాపు రెండు సంవత్సరాల తరువాత.. దుబాయ్ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పరిపాలన- దుబాయ్ మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందం ప్రకారం, దుబాయ్ ఐటీ టవర్లు, ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ టవర్లతో పాటు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్‌లను కశ్మీర్‌లో నిర్మిస్తుంది. అయితే, దుబాయ్ కశ్మీర్‌లో ఎంత పెట్టుబడి పెడుతుందనేది ఇంకా వెల్లడించలేదు. కాశ్మీర్ అభివృద్ధికి ప్రపంచం మాతో పాటు వస్తోందని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని ఈ ఒప్పందం చూపిస్తుందని ఆయన చెప్పారు.
ఇది పాకిస్తాన్ దౌత్యపరమైన ఓటమి: బాసిత్
దుబాయ్-జమ్మూ కాశ్మీర్ పరిపాలన మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ ఇది పాకిస్తాన్ కు దౌత్యపరమైన ఓటమిగా అభివర్ణించారు. బాసిత్ పాకిస్తాన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఈ ఒప్పందం భారతదేశానికి పెద్ద విజయం. ఇప్పటికే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC) కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు.
పాకిస్తాన్ ఒంటరిగా ఉంది..
కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ నిరంతరం మరిన్ని దేశాల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తోంది. కానీ టర్కీ, చైనాలు తప్ప, కాశ్మీర్ సమస్యపై ఇప్పటివరకు ఏ దేశమూ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ చేసిన లక్షలాది ప్రయత్నాల తర్వాత కూడా, సౌదీ అరేబియా.. ఇరాన్ ఈ అంశంపై మౌనంగా ఉన్నాయి.
పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్ల రుణాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నిరాకరించింది
పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నిరాకరించింది. 1 బిలియన్ డాలర్ల మొదటి విడత కూడా పాకిస్తాన్‌కు ఇవ్వడం కుదరదని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. వాస్తవానికి, వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్- పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఆదివారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని నివేదించింది. అమెరికా ఆర్థిక మంత్రి షౌకత్ తారెక్ బృందం, ఐఎంఎఫ్ మధ్య 11 రోజుల పాటు జరిగిన చర్చలు ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సమావేశం అక్టోబర్ 4 న ప్రారంభమై 15 అక్టోబర్ వరకు కొనసాగింది. కాగా, ఇప్పుడు దుబాయ్ కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం పాకిస్తాన్ కు పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పటికే తాలిబన్లను సమర్ధించి వారి నుంచి సమస్యలు ఎదుర్కుంటోంది పాకిస్తాన్. మరోవైపు అంతర్గతంగా ఇమ్రాన్ ఖాన్.. సైన్యం మధ్య దూరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ లో ఇమ్రాన్ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందనేది వాస్తవం.
ఇవి కూడా చదవండి: Vinai Thummalapally: అమెరికాలో హైదరాబాదీకి అరుదైన గౌరవం.. యుఎస్‌టిడిఎ డిప్యూటీ డైరెక్టర్ నియమించిన ప్రెసిడెంట్ జో బిడెన్
Pawan Kalyan: నిన్ను అలా అంటే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన ఏపీ మంత్రి