Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నిన్ను అలా అంటే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పవన్ కల్యాణ్‌‌ను ప్రశ్నించిన ఏపీ మంత్రి

AP Bandh: కార్యాలయాలపై దాడులను ఖండించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరి సీఎం జగన్‌ను ఉద్దేశించి పట్టాభి చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ఏపీ మంత్రి ప్రశ్నించారు.

Pawan Kalyan: నిన్ను అలా అంటే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పవన్ కల్యాణ్‌‌ను ప్రశ్నించిన ఏపీ మంత్రి
Pawan Kalyan
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 20, 2021 | 1:55 PM

టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందని గింజుకుంటున్నారు కానీ…టీడీపీ నేత పట్టాబి మాట్లాడిన మాటను ఎందుకు విస్మరిస్తున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. దాని అర్ధం ప్రజలకి ఇంకా తె లియలేదు కాబట్టి సరిపోయింది కానీ…లేదంటే అంతకంటే ఎక్కువ జరిగేదని వ్యాఖ్యానించారు. పట్టాబి అన్న మాటకు వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెంది ఉండొచ్చని, నిన్నటి ఘటనలకు అదే కారణమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కావాలనే ఇటువంటి కామెంట్స్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా టీడీపీ ఆఫీసులపై దాడిని ఖండిస్తున్నారు కానీ..ఆయన మాట్లాడిన మాటను ఎందుకు ఖండించడం లేదు..? అని ప్రశ్నించారు. నిన్ను అదే మాట అంటే నీ అభిమానులు ఊరుకుంటారా..? అని సూటిగా ప్రశ్నించారు.

అలాగే బీజేపీ సోము వీర్రాజు, సీపీఐ రామకృష్ణ ఎందుకు పట్టాభి మాటలను ఖండిచడం లేదో చెప్పాలని మంత్రి బాలినేని ప్రశ్నించారు. లోకేష్‌ మాకూ రాళ్లేసే సమయం వస్తుంది అంటున్నారని.. మీరు రాళ్లేస్తే మేము బండలేస్తామని హెచ్చరించారు. నారా లోకేష్ వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ ఒక్కరూ ఊరుకోరన్నారు. ప్రజలు కూడా సీఎం జగన్‌నుద్దేశించి పట్టాభి మాట్లాడిన మాటలను గమనించాలని మంత్రి బాలినేని కోరారు.

Also Read..

AP Bandh: పలాసలో వైసీపీ నిరసన ర్యాలీలో అపశృతి.. అంటుకున్న మంటలు.. ఆస్పత్రికి తరలింపు

LIC: వెంటనే ఇలా చేయండి.. కోట్లాది మంది పాలసీదారులకు విజ్ఞప్తి చేసిన ఎల్‌ఐసీ