AP Bandh: పలాసలో వైసీపీ నిరసన ర్యాలీలో అపశృతి.. అంటుకున్న మంటలు.. ఆస్పత్రికి తరలింపు

AP Bandh: ఏపీలో టీడీపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు..

AP Bandh: పలాసలో వైసీపీ నిరసన ర్యాలీలో అపశృతి.. అంటుకున్న మంటలు.. ఆస్పత్రికి తరలింపు
Follow us

|

Updated on: Oct 20, 2021 | 1:50 PM

AP Bandh: ఏపీలో టీడీపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. అయితే ఆ దాడులకు నిరసనగా ఈ రోజు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ప్రకటించింది. ఇక వైసీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తోంది. టీడీపీ చేపట్టిన బంద్‌కు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ, పట్టాభి దృష్టి బొమ్మలను దగ్ధం చేశారు వైసీపీ కార్యకర్తలు. ఈ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంలో వైసీపీ కార్యకర్త బొంపల్లి శ్రీనివాస్ ఒంటికి మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఇక టీడీపీ కార్యకర్తల ఆందోళనకు ధీటుగా వైసీపీ కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నిరసనకు దిగారు వైసీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇవీ కూడా చదవండి:

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!

AP Bandh Live: ఏపీలో టీడీపీ బంద్‌.. నేతల నిరసన.. ఉద్రిక్తత వాతావరణం.. టీడీపీ-పోలీసుల మధ్య తోపులాట

AP Bandh: చంద్రబాబు 420.. నీ ఆఫీస్‌లో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా..? కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు

AP Bandh: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసాలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల

AP Politics: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏపీ రాజకీయాలు.. ఎవ్వరేమి తక్కువ కాదన్నట్లు రచ్చ రచ్చ..!

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.