LIC: వెంటనే ఇలా చేయండి.. కోట్లాది మంది పాలసీదారులకు విజ్ఞప్తి చేసిన ఎల్‌ఐసీ
దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కోట్ల మంది పాలసీదారులకు ఓ SMS పంపింది. LIC PMLA ప్రకారం రూ .50,000 కంటే ఎక్కువ నగదు చెల్లించినప్పుడు..
దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కోట్ల మంది పాలసీదారులకు ఓ SMS పంపింది. LIC PMLA ప్రకారం రూ .50,000 కంటే ఎక్కువ నగదు చెల్లించినప్పుడు PAN తప్పనిసరి అని పేర్కొంది. పాలసీదారుడు తన LIC పాలసీకి వెంటనే పాన్ జోడించాలని కోరింది. నేడు అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పెద్ద ఎత్తున పాన్ కార్డుతో లింక్ చేయబడుతున్నాయి. LICని కూడా పాన్ లింక్ చేయాలని కోరింది. పాలసీతో పాన్‌ని లింక్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎల్ఐసి తెలిపింది. LIC పాలసీతో పాన్ కార్డును లింక్ చేసే ప్రక్రియ చాలా సులభం అని పేర్కొంది. మీరు ఇందులో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్లను పాలసీకి లింక్ చేయాలని కోరుతోంది. ఆన్‌లైన్‌లోనే ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. మీ పాలసీతో పాన్‌ని లింక్ చేయడానికి www.licindia.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. మీరు మొబైల్ నంబర్ ఇవ్వాలి అదే నంబర్‌లో OTP వస్తుంది. ఆ OTP తో లింక్ చేయడం పూర్తవుతుంది. ఫారమ్‌ను సమర్పించిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు సమాచారం అందించే సందేశం కనిపిస్తుంది. LIC పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ పనిని సులభంగా చేయవచ్చు. LIC దీని కోసం 3 దశలను ఇచ్చింది. దీని సహాయంతో LIC పాలసీని PAN తో లింక్ చేయడం సులభం అవుతుంది.
ఇవి కూడా చదవండి: LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..