AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Shopping: భారీ ఆఫర్లు ఉన్నాయని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు సంగతులు గుర్తుంచుకోండి..

భారీ ఆఫర్లు.. మంచి అవకాశం మించితే దొరకదంటూ ఊరిస్తున్నారు. భలే మంచి చౌకబేరమంటూ చాలామంది కొనేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన..

Online Shopping: భారీ ఆఫర్లు ఉన్నాయని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు సంగతులు గుర్తుంచుకోండి..
Shopping Online
Sanjay Kasula
|

Updated on: Oct 20, 2021 | 9:44 AM

Share

భారతదేశంలో పండుగ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి ఇలా వరుస పెద్ద పండుగలతో వ్యాపారాలు జోరందుకున్నాయి. చిన్న చిన్న షాపుల నుంచి షాపింగ్ మాల్స్‌ వరకు అన్ని బిజీగా మారాయి. ఇక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు పెద్ద తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సెల్‌లో కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగుతోంది..దీనికి తోడు వారు అందిస్తున్న ఆఫర్లకు అన్ని వర్గాల ప్రజలకు క్యూ కడుతున్నారు. ఇంట్లో సరుకులు, ఎలక్ట్రానిక్ గూడ్స్‌, మొబైల్స్‌, ల్యాపీలు ఇలా ఏది కావాలన్నా ఈ కామర్స్‌ సైట్లను ఆశ్రయిస్తున్నారు చాలామంది. భారీ ఆఫర్లు.. మంచి అవకాశం మించితే దొరకదంటూ ఊరిస్తున్నారు. భలే మంచి చౌకబేరమంటూ చాలామంది కొనేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలను తెలుసుకుందాం. 

విక్రేత సరైనదే అయితే..

మీరు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ సైట్‌ల ద్వారా తమ వస్తువులను విక్రయించే వివిధ విక్రేతలు కూడా ఉన్నారని మీకు తెలుసుకోండి. కాబట్టి మీరు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది విక్రేతలు ఎక్కువ డిస్కౌంట్లను చూపించడం ద్వారా తప్పుడు వస్తువులను డెలివరీ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి, మీరు ఏదైనా కొనుగోలు చేస్తుంటే మొదట విక్రేతను చూడండి. అతనికి వచ్చిన రేటింగ్‌ను గమనించాడండి. స్టార్ రేటింగ్ మంచిగా ఉంటేనే కొనండి. విక్రేత Amazon Fulfill లేదా Flipkart హామీ ఇచ్చినట్లుగా ఉంటే మరింత మంచిది.

క్యాష్ ఆన్ డెలివరీ ఎంపికను ఎంచుకోండి..

మీరు క్రొత్త వెబ్‌సైట్ నుండి షాపింగ్ చేస్తుంటే లేదా మీరు అక్కడ నుండి ఏదైనా ఆర్డర్ చేయకపోతే మీరు కొనుగోలు చేసినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఎంపికను ఎంచుకోండి. వీలైతే, డెలివరీ బాయ్ ముందు పార్సెల్ తెరవాలని పట్టుబట్టండి.

చెల్లింపు వివరాలను ఎప్పుడూ సేవ్ చేయవద్దు

ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను ఎప్పుడూ సేవ్ చేయవద్దు. తరచుగా సైట్‌లో కార్డు వివరాలను పూరించిన తర్వాత కార్డు వివరాలను సేవ్ చేసే ఎంపిక వస్తుంది. అస్సలు టిక్ చేయకండి. ఇది అస్సలు సురక్షితం కాదు. 

ఆఫర్‌ని చెక్ చేయండి

ఆన్‌లైన్ షాపింగ్‌లో కొన్నిసార్లు డిస్కౌంట్ వెంటనే ఇవ్వబడుతుంది. కొన్నిసార్లు అది కొన్ని రోజులు లేదా కొన్ని నెలల తర్వాత క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. కాబట్టి ముందుగానే సమాచారాన్ని చదవండి. ఆఫర్ కోడ్ ఉంటే  ఉపయోగించండి. మీరు ఏ బ్యాంక్ లేదా కార్డ్ నుండి అదనపు డిస్కౌంట్ పొందుతున్నారో కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఉపయోగించండి.

పబ్లిక్ వైఫైని ఉపయోగించడం మానుకోండి

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీ బ్యాంక్ ఖాతాను జాగ్రత్తగా ఫిల్ చేయండి. పబ్లిక్ Wi-Fi ని ఉపయోగించకపోవడం చాలా మంచిది. తరచుగా ప్రజలు సైబర్ కేఫ్ లేదా రెస్టారెంట్ వంటి పబ్లిక్ ప్రదేశంలో పబ్లిక్ Wi-Fi ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితిలో వారి బ్యాంక్.. వారి వివరాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేయవచ్చు.

నిజానికి ఆన్‌లైన్‌ షాపింగ్ చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి సంస్థల పేరు సెర్చ్‌ చేయాలి. అందులోకి వెళ్లి కావాల్సినవి ఆర్డర్‌ చేయాలి. అంతేగానీ అపరిచిత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందిస్తే మోసపోవడం ఖాయం. అందుకే అలాంటి వాటికి రెస్పాండ్ కావొద్దంటున్నారు సీసీఎస్ పోలీసులు. పండుగ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Last Date: ఈ నెలాఖరులోగా కచ్చితంగా ఈ 4 పనులు పూర్తి చేయండి.. లేకుంటే చాలా నష్టపోతారు..

TDP – YCP: ఏపీలో నిరసన జ్వాలలు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ – టీడీపీ నేతల పోటా పోటీ ఆందోళనలు..