Onion Prices: సామాన్యుడిని కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. దిగుబడి తగ్గడమే కారణమా..

పెట్రోల్, డిజీల్, వంట నూనె సామాన్యుడిపై పెను భారం మోపుతుంటే తాజాగా ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తుంది. వారం రోజుల్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. భారతదేశంలోని అతి పెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో టోకు ధరలు రెట్టింపు అయ్యాయి...

Onion Prices: సామాన్యుడిని కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. దిగుబడి తగ్గడమే కారణమా..
Onion
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 20, 2021 | 9:25 AM

పెట్రోల్, డిజీల్, వంట నూనె సామాన్యుడిపై పెను భారం మోపుతుంటే తాజాగా ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తుంది. వారం రోజుల్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. భారతదేశంలోని అతి పెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో టోకు ధరలు రెట్టింపు అయ్యాయి. కేవలం ఒక నెలలో టన్ను ఉల్లి రూ.33,400 కి చేరుకుంది. ముంబై వంటి మెట్రో ప్రాంతాల్లో రిటైల్ ధరలు కిలో రూ .50 కి పైగా ఉంది. ఇక హైదరాబాద్‎లో కిలో ఉల్లి రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉంది. కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధర ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు.

సెప్టెంబరులో మధ్యప్రదేశ్, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉల్లి పంట దెబ్బతిందని, దీంతో దిగుబడి తగ్గిందని చెప్పారు. కరోనా సమయంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధరలు దిగి వచ్చాయి. మళ్లీ ధరలు పెరగడం పట్ల సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పిటికే చర్యలు చేపట్టింది. బఫర్ స్టాక్ విడుదల చేసింది. అయితే మరింత ధర తగ్గాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుత పండుగ సీజన్‌లో ఉల్లిపాయ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ముంబైకి చెందిన డీలర్ ఒకరు చెప్పారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ఉల్లి ధర మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారుగా ఉంది. ధరల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంకలో ధరల పెరిగే అవకాశం ఉంది. ను మరింత పెంచే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.

Read Also.. Facebook: ఫేస్‎బుక్ పేరు మారుతుందా.. అక్టోబర్ 28న ఏం జరగబోతుంది..

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో ఈ ఆకుకూర తింటే చెప్పలేనన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు
చలికాలంలో ఈ ఆకుకూర తింటే చెప్పలేనన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..?
ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..?
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!