Gita Gopinath: IMF సేవల నుంచి తప్పుకోనున్న చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్.. జనవరి నుంచి అక్కడ సేవలు..

అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్ త్వరలో తన బాధ్యతల నుంచి నిష్క్రమించనున్నారు. జనవరి నుంచి ఆమె తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీ సేవల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Gita Gopinath: IMF సేవల నుంచి తప్పుకోనున్న చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్.. జనవరి నుంచి అక్కడ సేవలు..
Gita Gopinath
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 20, 2021 | 10:53 AM

Gita Gopinath: అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. జనవరి నుంచి ఆమె తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీ సేవల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్రం విభాగంలో పనిచేశారు. అక్కడి నుంచి తాత్కాలిక విరామం తీసుకుని ఐఎంఎఫ్ సేవల్లో చేరారు. మూడేళ్ల పాటు ఆమె ఐఎంఎఫ్‌లో కొనసాగేందుకు వీలుగా.. ఆమెకు కల్పించిన బ్రేక్ టైమ్‌ను ప్రత్యేక సందర్భంగా పరిగణిస్తూ ఏడాది పాటు హార్వర్డ్ యూనివర్సిటీ పొడగించింది. ఐఎంఎఫ్‌లో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఆమె.. తన పదవి నుంచి వైదొలగి మ‌ళ్లీ హార్వర్డ్ యూనివ‌ర్సిటీ ఆర్థిక‌శాస్త్రం విభాగంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఐఎంఎఫ్‌ను గీతా గోపినాథ్ వీడనున్నారన్న విషయాన్ని ఐఎంఎఫ్ అధికార వర్గాలు ధృవీకరించాయి.

ఐఎంఎఫ్ చీఫ్ ఎక‌నామిస్ట్ పోస్టులో ప‌ని చేసిన తొలి మ‌హిళ గీతా గోపినాథ్ కావడం విశేషం. అమెరికా, భార‌త్‌లో పౌర‌స‌త్వం ఉన్న గీతా గోపినాథ్‌.. 2018 అక్టోబ‌ర్ నుంచి ఐఎంఎఫ్ చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఐఎంఎఫ్‌లో ప‌రిశోధ‌నా విభాగానికి గీతా గోపినాథ్ అధిప‌తిగా వ్యవహరిస్తున్నారు. వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఔట్‌లుక్ నివేదిక‌లు ఆమె ఆధ్వర్యంలోనే త‌యార‌య్యేవి. పలు దేశాల జీడీపీ అంచ‌నాల నివేదిక‌ల‌ను ఆమె త‌యారు చేసేవారు.  కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో గీతా గోపినాథ్ అమోఘమైన సేవలు అందించారని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టలినా జార్గీవా కొనియాడారు. చీఫ్ ఎకానమిస్ట్‌ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. ఐఎంఎఫ్ సేవల నుంచి గీతా గోపినాథ్ వైదొలగనున్నట్లు జార్గీవా ధృవీకరించారు.

Also Read..

Viral Video: ఈ పెళ్లి కూతురు మామూలు స్పీడ్‎లో లేదు.. పెళ్లి మండపానికి ఎలా వెళ్లిందంటే.. వీడియో వైరల్..

T20 World Cup 2021: తొలి మ్యాచులో మోకాలిపై కూర్చుని నిరసన.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్ల నిర్ణయం.. ఎందుకో తెలుసా?