T20 World Cup 2021: తొలి మ్యాచులో మోకాలిపై కూర్చుని నిరసన.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్ల నిర్ణయం.. ఎందుకో తెలుసా?

England Vs West Indies: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా కరీబియన్ జట్టుతో మరోసారి ఇంగ్లండ్ టీం చేతులు కలపనుంది.

T20 World Cup 2021: తొలి మ్యాచులో మోకాలిపై కూర్చుని నిరసన.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్ల నిర్ణయం.. ఎందుకో తెలుసా?
England Vs West Indies
Follow us
Venkata Chari

|

Updated on: Oct 20, 2021 | 10:07 AM

T20 World Cup 2021, ENG vs WI: టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ జట్టు మోకాళ్లపై కూర్చుంటుంది. ఈ జట్టు టోర్నమెంట్‌లో వెస్టిండీస్‌తో తన మొదటి మ్యాచ్ ఆడవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా కరీబియన్ జట్టుతో మరోసారి చేతులు కలపనుంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఈ మేరకు ప్రకటించాడు.

ఇంగ్లండ్ టీం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ శనివారం ఈ మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ, ‘వెస్టిండీస్ జట్టు జాతి వివక్షకు వ్యతిరేకంగా మ్యాచ్‌లో మోకరిల్లడం ద్వారా నిరసన తెలుపుతుందని మేము విన్నాం. ఈ సందర్భంగా మా బృందం కూడా వారికి అండగా ఉంటుంది. మాటీం కూడా మోకరిల్లి వెస్టిండీస్ టీంకు మద్దతు ప్రకటిస్తాం. ఈ సమయంలో ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని’ సూచించారు.

ఐసీసీతో మంతనాలు.. మోర్గాన్ వెస్టిండీస్‌కి మద్దతుగా మోకాళ్లపై కూర్చిన నిరసన తెలేపేందుకు ఐసీసీతో మాట్లాడుతున్నామని తెలిపాడు. ‘మేం ఐసీసీతో మాట్లాడుతున్నాం, తద్వారా ఐక్యత సందేశం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా దేశంలో ఇది చేశాం. అయితే ఐసీసీ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ జట్టు మోకాలిపై నిలబడటం ఇదే మొదటిసారి కాదు. వెస్టిండీస్ టీ 20 కెప్టెన్ కీరన్ పొలార్డ్ తన జట్టు ప్రతి మ్యాచ్ ప్రారంభంలో మోకాలిపై కూర్చుని నిరసన తెలుపుతుంటారు. పొలార్డ్ మాట్లాడుతూ ‘నాకు తెలిసినంత వరకు ఇది మేం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మేము గట్టిగా నమ్ముతున్న విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ.. ఆగష్టు 2020 లో ఐర్లాండ్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు చివరిసారిగా ఇలా చేశారు. అయితే ఇకపై అలా చేయకూడదనే వారి నిర్ణయాన్ని వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ హోల్డింగ్ విమర్శించారు. ఈ నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌లో మళ్లీ మోకాలిపై కూర్చుని నిరసన తెలపడంపై ఆలోచిస్తున్నట్లు జోర్డాన్ చెప్పాడు. జోర్డాన్ ‘ది టెలిగ్రాఫ్’తో మాట్లాడుతూ, “మేం దీని గురించి చర్చిస్తాం. ప్రతి ఒక్కరూ వర్ణవివక్షత గురించి గట్టిగా ఆలోచిస్తే, మేం ఖచ్చితంగా చేస్తాం. అలా ఆలోచన చేయకుంటే మాత్రం ఇలా నిరసన తెలిపినా ప్రయోజనం లేదు’ అంటూ మాట్లాడాడు.

Also Read: T20 World Cup Controversies: రూల్స్ బ్రేక్ చేసిన ఆసీస్ ప్లేయర్‌.. కెరీర్‌నే ప్రమాదంలో పడేసిన ఓ సంఘటన.. అదేంటంటే?

India vs Australia, Warm Up Match: పాక్‌తో పోరుకు ముందు చివరి అవకాశం.. అందరి చూపు ఆ ఇద్దరి వైపే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!