India vs Australia, Warm Up Match: పాక్‌తో పోరుకు ముందు చివరి అవకాశం.. అందరి చూపు ఆ ఇద్దరి వైపే..!
టీ 20 ప్రపంచకప్‌లో ఈరోజు దుబాయ్ మైదానంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా తమ సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశంగా నిలిచింది.
T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్‌లో ఈరోజు దుబాయ్ మైదానంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా తమ సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశంగా నిలిచింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
టీమ్ కాంబినేషన్ ఎలా ఉండనుందంటే.. ఇంగ్లండ్‌పై తమ ఆటతో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు నిరాశ చెందారు. అయితే ఇషాన్ కిషన్ తన తుఫాను బ్యాటింగ్‌తో ప్లేయింగ్ ఎలెవన్ కోసం బలమైన వాదనను వినిపించాడు. ఆర్ అశ్విన్ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత టీ20 జట్టుకు తిరిగి వచ్చాడు. మొదటి వార్మప్ మ్యాచ్‌లో అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవచ్చు.. కానీ, అతను చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అటువంటి పరిస్థితిలో కెప్టెన్ కోహ్లీ ఆస్ట్రేలియాతో సూపర్ 12 ప్రారంభానికి ముందు మెరుగైన జట్టు కాంబినేషన్ల కోసం వెతకడంలో బిజీగా మారిపోయాడు.
హిట్ మ్యాన్ కూడా ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు విశ్రాంతిని ఇచ్చారు. కానీ, ఆస్ట్రేలియాతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఐపీఎల్ ఫేజ్ -2 లో అతని ప్రదర్శన నిరాశపరిచింది. 6 ఇన్నింగ్స్‌లలో రోహిత్ బ్యాట్ నుంచి 131 పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లో, రోహిత్ శర్మ ఫామ్ టీమిండియాకు చాలా ముఖ్యం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు, రోహిత్ తన ఫామ్‌కు తిరిగి రావడానికి మంచి అవకాశం ఆస్ట్రేలియా రూపంలో దొరికింది.
అందరి చూపు హార్దిక్ వైపు.. అందరి చూపు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఉంన్నాయి. మొదటి వార్మప్ మ్యాచ్‌లో కూడా హార్దిక్ బౌలింగ్ చేయలేదు. రెండో వార్మప్ మ్యాచ్‌లో కూడా పాండ్యా బౌలింగ్ చేయకపోతే, అతను టోర్నమెంట్‌లో ఫినిషర్‌గా కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు. అయితే, అటువంటి పరిస్థితిలో, హార్దిక్ పాండ్యా మాత్రం శార్దూల్ ఠాకూర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించడం అతనికి అంత సులభం కాకపోవచ్చు. శార్దూల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. అలాగే తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా కూడా.. ఆస్ట్రేలియా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. టీమిండియా ఖచ్చితంగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్ ఫేజ్ -2 లో మాక్స్‌వెల్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. 8 మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి 290 పరుగులు సాధించాడు. అదే సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కేన్ రిచర్డ్సన్ 3, ఆడమ్ జాంపా 2 వికెట్లు తీశారు.
అయితే, డేవిడ్ వార్నర్ ఫామ్ జట్టుకు ఇబ్బంది కలిగించేలా తయారైంది. అతను కివీ జట్టుపై గోల్డెన్ డక్‌కే పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ ఫేజ్ -2 లో కూడా అతని బ్యాట్ రెండు మ్యాచ్‌లలో 2 పరుగులు మాత్రమే చేసింది.
భారత జట్టు: కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చకరవర్తి, రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ ఇంగ్లిస్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, జోష్ హాజెల్‌వుడ్, మిచెల్ స్వీప్సన్, గ్లెన్ మాక్స్‌వెల్ , పాట్ కమిన్స్